అమెరికా ఎన్నికల్లో తెలుగు మహిళకు షాక్.. సరితా కోమటిరెడ్డి ఓటమి!
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:20 PM
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మహిళ సరితా కోమటిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం బరిలోకి దిగిన ఆమెకు ఓటమి ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మహిళ సరితా కోమటిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం బరిలోకి దిగిన ఆమెకు ఓటమి ఎదురైంది. సరితపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లెటిటియా జేమ్స్ విజయం సాధించారు. అనంతరం ఈ ఫలితాలపై సరిత స్పందించారు. తన ఓటమిని అంగీకరిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రజాసేవ కోసం మాత్రమే తాను ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజాసేవను వదలబోనని పేర్కొన్నారు. న్యూయార్క్ నగరాన్ని మరింత సురక్షితంగా మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.
కాగా సరితా కోమటిరెడ్డికి న్యాయ రంగంలో ఎనలేని అనుభవం ఉంది. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, సైబర్ నేరాలు, మనీలాండరింగ్ కేసులను ఆమె వాదించారు. సరిత తల్లిదండ్రులు డాక్టర్ హనుమంతరెడ్డి, డాక్టర్ గీత తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వాసులు. వారు1980వ దశకంలో భారత్‌ను వదలి అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. తాను బ్రూక్లిన్‌లో జన్మించానని సరిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ వార్తలూ చదవండి
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు
అమెరికాలో ఈవీఎంలు లేకుండానే గంటల్లో ఫలితాలు.. కోట్లాది ఓట్ల లెక్కింపు ఇంత వేగంగా ఎలా