గ్రీన్‌లాండ్ వ్యవహారంతో మాకేం సంబంధం లేదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:48 AM
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్‌లాండ్ భద్రతకు చైనా, రష్యా నుంచి ముప్పు పొంచిఉందని ఆరోపించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సమావేశంలో పుతిన్ స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
'గ్రీన్‌లాండ్‌లో ఏం జరుగుతుందో మాకు అనవసరం. మొదటి నుంచి గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఒక చిన్న ప్రాంతంగానే చూసింది. ప్రస్తుతానికి ఈ అంశంపై ఎవరికీ పట్టింపు, ఆసక్తి లేదని నా ఉద్దేశం' పుతిన్ చెప్పారు. ఎవరెన్ని రకాలుగా బెదిరించినా.. ఈ విషయంలో రష్యా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రీన్‌లాండ్ వ్యవహారం అమెరికా, డెన్మార్క్‌లు కలిసి పరిష్కరించుకుంటాయని పుతిన్ చెప్పారు. 1917లో డెన్మార్క్.. వర్జిన్ దీవులను అమెరికాకు విక్రయించింది. 1867లో రష్యా.. అలస్కాను యూఎస్‌కు 7.2 మిలియన్ డాలర్లరకు అమ్మిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు పుతిన్.
గాజాలో యుద్ధాన్ని అంతం చేయడానికి ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై కూడా పుతిన్ స్పందించారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందిన పత్రాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ శాంతి భద్రత కోసం చేసే ప్రయత్నాలకు రష్యా ఎప్పుడూ మద్దతిస్తుందన్నారు. గాజా శాంతి ప్రణాళికకు 1 బిలియన్ డాలర్ల సొమ్ము విరాళంగా ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా పుతిన్ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీయేలోకి టీటీవీ దినకరన్
తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు..
Read Latest National News