సముద్రంలో మునిగిన నౌక.. 15 మంది జలసమాధి..
ABN , Publish Date - Jan 26 , 2026 | 08:37 AM
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ బోట్ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ ఫిలిప్పీన్స్(Southern Philippines )లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ బోట్ (ప్యాసింజర్ నౌక) సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది జలసమాధి(water grave) అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్(Rescue team) సహాయకచర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 250 మందిని రక్షించినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ సోమవారం తెలిపింది.
జాంబోంగా నగరం నుంచి సులు ప్రావిన్స్ లోని జోలో ద్వీపానికి ఈ ఫెర్రీ బయలుదేరింది. బాసిలన్ ప్రావెన్స్ లోని బలుక్‌బలుక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇతర నౌకలు మత్స్యకారులు, కోస్ట్ గార్డ్ యూనిట్లు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
గణతంత్ర దినోత్సవం..982 మంది పోలీసులకు అవార్డులు