పనామాలో మరోసారి భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత
ABN , Publish Date - Oct 13 , 2026 | 07:02 AM
పనామా దేశంలో సోమవారం తీవ్ర భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: పనామా దేశంలో సోమవారం తీవ్ర భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. 35 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
కాగా గత శుక్రవారం పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని కారణంగా వందలాది నివాస సముదాయాలు ధ్వంసమయ్యాయి. సుమారు 900 భవనాలు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భూకంపం తరువాత అక్కడ దాదాపు 300 ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సహాయక చర్యలు ప్రారంభించింది. పనామాలోని లాస్ శాంటోస్, కోక్లే, హెర్రెరా ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
ఈ వార్తలూ చదవండి
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి!
రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. షాకింగ్ సీన్స్