నైజీరియాలో ఘోరం.. చిన్న పొరపాటుతో 100 మంది మృతి..
ABN , Publish Date - Apr 13 , 2026 | 08:56 AM
ఈశాన్య నైజీరియాలో పొరపాటున జరిగిన సైనిక వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మృతిచెందారు. బోకో హరామ్ జిహాదీలను లక్ష్యంగా చేసుకున్న దాడి కాస్తా మిస్ ఫైర్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
అబుజా: ఈశాన్య నైజీరియాలో పొరపాటున జరిగిన సైనిక వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మృతిచెందారు. బోకో హరామ్ జిహాదీలను లక్ష్యంగా చేసుకున్న దాడి కాస్తా మిస్ ఫైర్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య నైజీరియా యోబే రాష్ట్రంలో జిహాదీలు అధికంగా ఉన్నారు. వారిని టార్గెట్ చేస్తూ నైజీరియా ఆర్మీ దాడి చేసింది.
పొరపాటున ఒక గ్రామ మార్కెట్‌పై ఆ దాడి జరిగి 100కి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. తమ దాడి విఫలమైందని, పొరపాటు జరగడం నిజమేనని అక్కడి అధికారులు అంగీకరించారు. అయితే, మరిన్ని వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. కాగా, అక్కడ ఆర్మీ, జిహాదీలకు తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి.
బోకో హరామ్..
నైజీరియాలో 2000వ దశాబ్ద ప్రారంభంలో బోకో హరామ్ అనే జిహాదీ తీవ్రవాద సంస్థ ఏర్పడింది. దాన్ని మహమ్మద్ యూసుఫ్ అనే తిరుగుబాటు దారుడు స్థాపించాడు. నైజీరియాలో పాశ్చాత్య విద్య నిషేధం, కఠినమైన షరియా చట్టం అమలుతో దేశాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనేది బోకో హరామ్ ఉద్దేశం. 2003లో యూసుఫ్ మరణం తర్వాత ఆ సంస్థ పగ్గాలు అబూబకర్ షెకావ్ చేతికి వెళ్లాయి.
అబూబకర్ ఆధ్వర్యంలో జిహాదీలు అత్యంత హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. సామూహిక హత్యలు, బాంబు దాడులు, కిడ్నాప్‌లతో సహా అనేక నేరాలు చేస్తున్నారు. 2014లో చిబోక్‌లో ఓ పాఠశాలపై దాడి చేసి 200 మందికి పైగా బాలికలను కిడ్నాప్ చేయడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించింది. వారి అరాచకాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..