యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..
ABN , Publish Date - Apr 13 , 2026 | 08:15 AM
హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హోర్ముజ్‌లో యుద్ధ నౌకలు కనిపిస్తే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హోర్ముజ్ ఇప్పటికీ తమ నియంత్రణలోనే ఉందని పేర్కొంది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రమాదం తప్పదని హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ సైనిక దళం (ఐఆర్‌జీసీ) కూడా ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. హోర్ముజ్ వైపు వచ్చే యుద్ధ నౌకలపై దాడి చేస్తామని హెచ్చరించింది. పౌర నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇచ్చింది. యుద్ధ నౌకలు వస్తే మాత్రం కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది.
ఇక యూఎస్‌తో చర్చలు విఫలం కావడంపై ఇరాన్ మంత్రి అరాగ్చీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 47 ఏళ్ల తరువాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలకు తాము సదుద్దేశంతో వెళ్లామని చెప్పారు. ఒప్పందం అంగుళం దూరంలో ఉండగా యూఎస్ తన లక్ష్యాలను, ఉద్దేశాలను మార్చుకుందని ఆరోపించారు. మునుపటి అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలను అమెరికా నేర్చుకోలేదని అన్నారు. మంచి భావాలుంటే చివరకు మంచే జరుగుతుందని అన్నారు. మనసులో శత్రుత్వం ఉంటే తుదకు అదే మిగులుతుందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
సోమవారం హోర్ముజ్‌లో నౌకల ట్రాఫిక్ స్తంభించిపోయిందని లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ అనే మారిటైమ్ సంస్థ తాజాగా పేర్కొంది. హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ ప్రకటన తరువాత నౌకల రాకపోకలు నిలిచిపోయాయని పేర్కొంది. ఎలాంటి ఒప్పందం లేకుండా ఇరాన్‌తో చర్చలు ముగియడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం కొనసాగుతోందని అన్నారు. ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందా? రాదా? అనేది తనకు ఇక అనవసరమని కూడా చెప్పారు. ఇప్పటికే ఇరాన్ పరిస్థితి దగజారిందని, మిలిటరీ ధ్వంసమైపోయిందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
అందమైన అమ్మాయిని పంపండి.. నేను పెళ్లి చేసుకుంటా..!