రసాయన శాస్త్రంలో కగాన్, సోయైలకు నోబెల్ పురస్కారం..
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:27 PM
రసాయన శాస్త్రంలో నోబెల్ కెమిస్ట్రీ పురస్కారం-2026 ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కగాన్, జపాన్‌కు చెందిన కెన్సో సోయైలకు దక్కింది. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్‌లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకాటలిసిస్‌పై చేసిన కీలక పరిశోధనలకు వారిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రసాయన శాస్త్రంలో నోబెల్ కెమిస్ట్రీ పురస్కారం-2026 ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి.కగాన్, జపాన్‌కు చెందిన కెన్సో సోయైలకు దక్కింది. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్‌లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకాటలిసిస్‌పై చేసిన కీలక పరిశోధనలకు గానూ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారిని ఎంపిక చేసింది. జీవరసాయనంలో శతాబ్దానికి పైగా మిస్టరీగా ఉన్న ‘హోమోచిరాలిటీ’ ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవడంలో వారిద్దరి పరిశోధనలు కీలకంగా మారాయి. దీంతో కగాన్, సోయైలకు అవార్డు ప్రకటించారు.
కాగా, రసాయన శాస్త్రంలో 1901 నుంచి 2025 వరకు 117 సార్లు నోబెల్‌ను ప్రకటించారు. ఇప్పటివరకూ 198 మంది అవార్డును అందుకోగా.. 35 ఏళ్ల వయసులో నోబెల్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా ఫ్రెడెరిక్ జొలియట్ రికార్డు సృష్టించారు. అలాగే 97 ఏళ్ల వయసులో కెమిస్ట్రీలో పురస్కారం అందుకున్న వ్యక్తిగా జాన్.బి గూడ్‌ఎనఫ్ నిలిచారు. రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ అందుకున్న ఘనతను ఫ్రెడరిక్ సాంగెర్, బ్యారీ షార్ప్‌లెస్ సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కెప్టెన్ స్మిత్‌ను కాపాడేందుకు.. 45 నిమిషాల పోరాటం.. కళ్లు మూసుకోవద్దంటూ..
ఓటర్ల ప్రధాన సమస్యలేంటో నాకు తెలియదు: ట్రంప్