ఆ పాప.. ఈ బామ్మ..
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:22 AM
నేపాల్‌లో ముంచుకొచ్చిన జలప్రళయం ఊళ్లకు ఊళ్లనే ముంచేస్తూ.. దార్లో అడ్డొచ్చిన అన్నింటినీ ధ్వంసం చేస్తూ ముందుకు సాగితే ఆ విలయంలో ఎంతో మంది చనిపోయారు. ముఖ్యంగా...
నేపాల్ వరదల్లో మృత్యుంజయులు
నేపాల్‌లో ముంచుకొచ్చిన జలప్రళయం ఊళ్లకు ఊళ్లనే ముంచేస్తూ.. దార్లో అడ్డొచ్చిన అన్నింటినీ ధ్వంసం చేస్తూ ముందుకు సాగితే ఆ విలయంలో ఎంతో మంది చనిపోయారు. ముఖ్యంగా రసువా జిల్లాలోని టిమూరే గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కానీ.. ఆ గ్రామంలో మూడురోజులుగా బురద, శిథిలాల కింద చిక్కుకుపోయిన మనీషా మగర్ అనే ఆరేళ్ల చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. సహాయక చర్యలు ప్రారంభించిన ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌కు శిథిలాల నుంచి ఆమె ఏడుపు వినిపించడంతో.. ఎంతో శ్రమించి బయటకు తీశారు. అప్పటికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఆమెకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి.. ఆహారం అందించి ప్రాణాలు కాపాడారు. ఆ చిన్నారిని కాపాడిన వీడియో వైరల్ అవుతోంది. అలాగే.. ఒళ్లంతా బురదతో ఎక్స్‌కవేటర్‌లో కూర్చుని ఉన్న 97 ఏళ్ల గుణ మాయ బొహారా ఫొటో కూడా వైరల్ అవుతోంది. బురద, శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆమెను బయటకు తీయడానికి సహాయక సిబ్బందికి 4 గంటలు పట్టింది.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News