Share News

ముస్లిం దేశాలు ఏకం కావాలి.. నిజమైన శత్రువును గుర్తించాలి: మొజ్తాబా ఖమేనీ

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:07 PM

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ముస్లిం దేశాలకు కీలక సూచన చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి ఏకం కావాలని కోరారు. ముస్లింల మధ్య విభజన, ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన హెచ్చరించారు.

ముస్లిం దేశాలు ఏకం కావాలి.. నిజమైన శత్రువును గుర్తించాలి: మొజ్తాబా ఖమేనీ
Mojtaba Khamenei

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ముస్లిం దేశాలకు కీలక సూచన చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి ఏకం కావాలని కోరారు. ముస్లింల మధ్య విభజన, ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన హెచ్చరించారు. ఇస్లామిక్ యూనిటీ వీక్ సందర్భంగా ఆదివారం ఖమేనీ ఈ సందేశాన్ని తన టెలిగ్రామ్ ఖాతాలో విడుదల చేశారు (Mojtaba Khamenei Letter).


ఐక్యత, స్నేహం, పరస్పర సహకారమే ముస్లిం దేశాల సమస్యలకు పరిష్కారం అని ఖమేనీ పేర్కొన్నారు. ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే వారు ఇస్లాం శత్రువుల ప్రయోజనాలకు సేవ చేస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల పాలకులను ఉద్దేశించి.. 'మీ నిజమైన శత్రువును గుర్తించండి.. వారి ప్రణాళికను అర్థం చేసుకుని ఎదుర్కోండి' అని పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌ను ముస్లిం దేశాల ప్రత్యర్థులుగా ఆయన పేర్కొన్నారు (Muslim unity).


ముస్లిం దేశాలు ఐక్యంగా ఉండి ఉంటే పాలస్తీనియన్లు ఇంతగా బాధపడాల్సి వచ్చేదా అని కూడా ఆయన ప్రశ్నించారు (Iran US Israel). గల్ఫ్ దేశాలు పరస్పరం సహకరించుకోవడం, అవసరమైనప్పుడు ఒకరికొకరు రక్షణగా నిలవడం అవసరమని ఆయన సూచించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలతో ఇరాన్ పరోక్షంగా యుద్ధం చేస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసింది.


ఇవి కూడా చదవండి..

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..


పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

Updated Date - Aug 30 , 2026 | 05:34 PM