Share News

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:10 PM

చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోంది. యువత పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, దేవాలయాల్లోనూ వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..
China falling marriage numbers

ఇంటర్నెట్ డెస్క్: చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోంది. యువత పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, దేవాలయాల్లోనూ వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని లింజి జిల్లాలో ఉన్న మాతా శిశు ఆరోగ్య ఆసుపత్రిలో వివాహ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు (China marriage registration).


ఆగస్టులో టియాంజిన్‌లోని పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ చైనా శాఖలో ప్రత్యేక వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది చైనాలో బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తొలి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కేంద్రంగా నిలిచింది. ఇక గ్వాంగ్‌జౌ బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా వివాహ ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు విమానాలు టేకాఫ్ అవుతున్న దృశ్యాలను చూసేందుకు ప్రత్యేక అవకాశాలను కూడా కల్పిస్తున్నారు (China falling marriage numbers).


చైనాలో వివాహాల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గుతోంది (China marriage crisis). 2026 తొలి ఆరు నెలల్లో సుమారు 32.75 లక్షల జంటలు మాత్రమే వివాహం చేసుకున్నారు. గతేడాది ఇదే కాలంలో నమోదైన 35.39 లక్షలతో పోలిస్తే ఇది 7.5 శాతం తక్కువ. అదే సమయంలో విడాకుల సంఖ్య 13.83 లక్షలకు పెరిగింది. వివాహాల తగ్గుదల భవిష్యత్ జననాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. వివాహాల సంఖ్యను పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

‘ఆప్’ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి మరీ..

Updated Date - Aug 30 , 2026 | 04:10 PM