కర్మభూమి తర్వాతే జన్మభూమి
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:07 AM
ప్రవాస భారతీయులు కర్మభూమికి(తాము పనిచేస్తూ, జీవిస్తున్న దేశాలకు) విధేయులుగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ సూచించారు....
ఎన్‌ఆర్‌ఐలకు మోహన్ భాగవత్ పిలుపు
న్యూయార్క్, ఆగస్టు 30: ప్రవాస భారతీయులు కర్మభూమికి(తాము పనిచేస్తూ, జీవిస్తున్న దేశాలకు) విధేయులుగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ సూచించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్ మ్యాడిసన్ స్క్వేర్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో ఆరు వేల మందికి పైగా హాజరైన ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత్ జన్మభూమి అయితే అమెరికా కర్మభూమి అవుతుందని, తొలుత కర్మభూమి కోసమే పనిచేయాలన్నారు. కర్మభూమి బాధ్యతలను నెరవేర్చాక జన్మభూమికి సేవ గురించి ఆలోచించాలని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్, అమెరికాల డీఎన్‌ఏలో ఉందని అన్నారు. వైవిధ్యంలో ఉన్న ఏకత్వాన్ని సాకారం చేయడం, ప్రపంచానికి ఎప్పటికప్పుడు దాన్ని అర్థమయ్యేలా చేయడం భారత్ బాధ్యతని భాగవత్ చెప్పారు. ఎంత సంపాదిస్తున్నామనేది అంత ముఖ్యం కాదని, ఎంత పంచుతున్నామనేదే ముఖ్యమని భాగవత్ నొక్కి చెప్పారు.
త్రివర్ణ పతాకాన్ని చించివేసిన ఖలీస్థానీ మద్దతుదారులు
న్యూయార్క్ మ్యాడిసన్ స్క్వేర్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్ బయట కొందరు ఖలీస్థానీ మద్దతుదారులు, సిఖ్ ఫర్ జస్టిస్ సభ్యులు భారత జాతీయ జెండాను చించివేశారు. కాళ్లకు త్రివర్ణ పతాకాన్ని కట్టుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా, ఖలిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News