Share News

కారు బాంబు దాడి.. మాలి రక్షణ శాఖ మంత్రి మృతి..

ABN , Publish Date - Apr 26 , 2026 | 08:51 PM

తిరుగుబాటు దళాల దాడుల్లో మాలి దేశ రక్షణ శాఖ మంత్రి సాడియో కామారా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బొమాకో సమీపంలోని కిటా ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసంపై కారు బాంబుతో దాడి చేసి హతమార్చారు.

కారు బాంబు దాడి.. మాలి రక్షణ శాఖ మంత్రి మృతి..
Mali Defense Minister Sadio Camara

ఇంటర్నెట్ డెస్క్: తిరుగుబాటు దళాల దాడుల్లో మాలి దేశ రక్షణ శాఖ మంత్రి సాడియో కామారా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బొమాకో సమీపంలోని కిటా ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసంపై కారు బాంబుతో దాడి జరిగింది. ఈ ఘటనలో సాడియో కామారా, ఆయన రెండో భార్య సహా ఇద్దరు మనవళ్లు మృతిచెందారు. కామారా మృతిచెందినట్లు ఆయన కుటుంబసభ్యులు, అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన మాలి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.


అజావాద్ లిబరేషన్ ఫ్రండ్ (FLA)కి చెందిన టువారెగ్ తిరుగుబాటు దళాలు, జేఎన్ఐఎమ్ (JNIM) జిహాదీ గ్రూప్ సంయుక్తంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించారు. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా దీన్ని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. మరోవైపు రాజధాని పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు అధికారులు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, స్థానిక ప్రజల్లో మాత్రం భయం నెలకొంది. శనివారం నాడు జరిగిన దాడుల్లోనూ సుమారు 16 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.


మాలిలోని కిడాల్, గావో, సెవేరే వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం అంతర్యుద్ధం కొనసాగుతోంది. గత దశాబ్ద కాలంగా మాలి దేశం తీవ్ర ఉగ్రవాద, అంతర్గత యుద్ధాలను ఎదుర్కొంటోంది. 2020లో సైనిక తిరుగుబాటు తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించా.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..

వైట్‌హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు.. నిందితుడి టార్గెట్ ట్రంప్!

Updated Date - Apr 26 , 2026 | 09:01 PM