ఇజ్రాయెల్ సైనికులకు సెలవులు రద్దు.. ఇరాన్‌పై మరో దాడి చేయబోతున్నారా..
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:51 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయా? ఇరాన్‌పై మరో దాడి జరగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయా? ఇరాన్‌పై మరో దాడి జరగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులకు మంజూరు చేసిన సెలవులను రద్దు చేసింది. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి (Israel Iran Conflict).
సైనికులకు ఇచ్చిన సెలవులను ఇజ్రాయెల్ రద్దు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇతర దేశాలపై దాడులు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇరాన్‌పై మొదటిసారి దాడులు చేపట్టడానికి ముందు కూడా ఇజ్రాయెల్ ఇలాంటి ప్రకటనే చేసింది. ఇరాన్‌పై యుద్ధాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తున్న తరుణంలో, నెతన్యాహు మాత్రం దాడులు చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి (Israel Military Leave Cancelled).
కాగా, ఇరాన్‌తో యుద్ధం ముగింపు, గాజాలో దాడుల నిలుపుదల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను నెతన్యాహు వ్యతిరేకించారు (Netanyahu Iran Strike). గాజా విషయంలో అమెరికా ప్రతిపాదనలను అంగీకరించబోమని, హమాస్ పూర్తిగా ఆయుధాలను పక్కనపెట్టే వరకు వెనక్కి తగ్గబోమని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన..
సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..