Share News

ఇరాన్‌ అప్రమత్తం.. విద్యుత్ ప్లాంట్ల చుట్టూ యువత మానవ హారాలు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:55 PM

హోర్ముజ్ జలసంధి తిరిగి తెరిచేందుకు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో ఇరాన్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.

 ఇరాన్‌ అప్రమత్తం.. విద్యుత్ ప్లాంట్ల చుట్టూ యువత మానవ హారాలు!

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఇరాన్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లపై భీకరదాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక విద్యుత్ కేంద్రాల చుట్టూ క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు సహా యువత అంతా మానవహారాలు ఏర్పాటుచేయాలని ఇరాన్ పిలుపునిచ్చినట్టు సమాచారం. దీంతో యువత పెద్దఎత్తున స్పందిస్తూ ఐక్యతను చాటుకుంటోంది.


అయితే.. ఈ ఆలోచన యువత నుంచే వచ్చిందని ఇరాన్ యువజన వ్యవహారాల ఉప మంత్రి అలిరెజా రహీమీ వెల్లడించారు. 'యువతే స్వయంగా ఈ రకమైన సూచన చేశారు. కొందరు విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువ కళాకారులు, యువజన సంస్థలు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ వలయంలా ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు' అని రహీమీ చెప్పారు. ఈ నిర్ణయం.. దేశ మౌలిక వసతులను రక్షించడం సహా యువత నిబద్ధతకు, వారి భవిష్యత్తు నిర్మాణానికి సంకేతంగా నిలుస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.


కాగా.. హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు మంగళవారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3:30 గంటలకు) వరకు గడువు విధించారు ట్రంప్. ఈ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే కఠినమైన సైనిక చర్యలు తీసుకుంటామని.. మౌలిక వసతులపై దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో డెడ్‌లైన్ ముగిసిన అనంతరం.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు దాడులను తీవ్రతరం చేసే అవకాశముంది.


ఇవీ చదవండి:

140 లక్షల మంది ఇరానియన్లు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

నెలకు రూ.40 వేల కోట్లు.. అదే జరిగితే ఇరాన్ జాక్‌పాట్ కొట్టినట్టే..

Updated Date - Apr 07 , 2026 | 05:00 PM