అంతరక్షింలోకి న్యుటెల్లా.. ఉచితంగా భారీ పబ్లిసిటీ..
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:36 PM
సాధారణంగా ఏ సంస్థ అయినా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అయితే అమెరికాకు చెందిన చాక్లెట్–హాజెల్‌నట్ జామ్ 'న్యుటెల్లా'కు రూపాయి ఖర్చు లేకుండా భారీ పబ్లిసిటీ వచ్చేసింది.
సాధారణంగా ఏ సంస్థ అయినా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అయితే అమెరికాకు చెందిన చాక్లెట్–హాజెల్‌నట్ జామ్ 'న్యుటెల్లా'కు రూపాయి ఖర్చు లేకుండా భారీ పబ్లిసిటీ వచ్చేసింది. చంద్రుడిని చుట్టి వచ్చేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' చేపట్టిన 'ఆర్టెమిస్-2' యాత్ర ద్వారా 'న్యుటెల్లా'కు ఉచితంగా బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది. వ్యోమగాములు తమతో పాటు 'న్యుటెల్లా' డబ్బాను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు (Nutella NASA livestream).
వ్యోమనౌకలోని దృశ్యాలు లైవ్ స్ట్రీమ్ అయిన సంగతి తెలిసిందే. అంతరరిక్షంలోని జీరో గ్రావిటీలో వ్యోమనౌకలతో పాటు 'న్యుటెల్లా' జార్ కూడా గాల్లో తేలియాడుతూ కనిపించింది. వీడియోలో దాని లేబుల్ స్పష్టంగా కనిపించింది. ఆ దృశ్యం పూర్తిగా 'న్యుటెల్లా' కోసం రూపొందించిన యాడ్‌లా కనిపించింది. ఎటువంటి ప్రయత్నమూ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇలా జరగడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఆ వీడియోను 'న్యుటెల్లా' ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Artemis II mission).
'చరిత్రలో ఇప్పటివరకు ఏ జామ్ కూడా ప్రయాణించనంత దూరం వెళ్లగలగడాన్ని గౌరవంగా భావిస్తున్నాం (Nutella space video). చిరునవ్వులను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాం' అంటూ 'న్యుటెల్లా' ఆ వీడియోను 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'మాకు న్యుటెల్లా అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదే నిదర్శనం' అని ఒక యూజర్ పేర్కొన్నారు. అంతరిక్షంలోని గ్రహాంతర వాసులు కూడా ఈ అద్భుత ఆహార పదార్థానికి ఫిదా అవుతారని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..