భారీ ఎత్తున 'శాక్రిఫైస్ ఫర్ ఇరాన్' పరేడ్.. డ్రోన్ల ప్రదర్శనతో శత్రుదేశాలకు హెచ్చరిక
ABN , Publish Date - Sep 18 , 2026 | 02:56 PM
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో 'ఇరాన్ కోసం త్యాగం' పరేడ్ పెద్ద ఎత్తున సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్.. దేశ భద్రత, సార్వభౌమాధికారం, ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 18: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో 'ఇరాన్ కోసం త్యాగం' పరేడ్ పెద్ద ఎత్తున సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్.. దేశ భద్రత, సార్వభౌమాధికారం, ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇరాన్ దేశ గౌరవాన్ని కాపాడడమనేది పౌరులందరికీ చెందుతుంది. ఇందుకు ప్రజల భాగస్వామ్యం, ఐక్యత చాలా అవసరం అని పెజెష్కియాన్ అన్నారు. ప్రతీ విషయంలోనూ ఇరాన్ ప్రజలు చూపే ఐక్యతే శత్రు దేశాల కుట్రలను భగ్నం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
యుద్ధ వీరులు, కొత్తగా పెళ్లయిన జంటలు, సైనిక దళాలు, మహిళలతో పాటు యెమెన్ పౌరులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇటీవల అమెరికా దాడుల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొదట ఓట్ చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్ గాంధీ
దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్ ఎంవోయూ
For More AP News And Telugu News