హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్
ABN , Publish Date - Jul 05 , 2026 | 03:02 PM
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి సేవా రుసుములు వసూలు చేస్తామని ప్రకటించింది.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి సేవా రుసుములు వసూలు చేస్తామని ప్రకటించింది. అయితే తమతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న దేశాలకు మాత్రం ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తామని స్పష్టం చేసింది (Transit Fees in Strait of Hormuz).
చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ హోర్ముజ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'హోర్ముజ్ జలసంధి ఇరాన్ ప్రాదేశిక జలాల్లో ఉంది. జలసంధిలో ఇకపై సేవా రుసుములు వసూలు చేస్తాం. ఇవి టోల్ కిందకు రావు. హోర్ముజ్‌లో ప్రయాణ భద్రతకు హామీ ఇవ్వడం, నౌకల రాకపోకలను పర్యవేక్షించడం వంటి పనులను ఒమన్ సహకారంతో పర్యవేక్షిస్తాం' అని రెజా పేర్కొన్నారు (Hormuz Oil Trade).
హోర్ముజ్‌లో విధించే సేవా రసుం విషయంలో మిత్రదేశాలకు ప్రత్యేక రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని ఇరాన్ ఆలోచిస్తోందని రెజా తెలిపారు (Crude Oil Shipping News). హోర్ముజ్ నియంత్రణ గురించి ఒమన్‌తో పూర్తి స్థాయి చర్చలు జరుపుతామని రెజా పేర్కొన్నారు. అలాగే ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి హోర్ముజ్ జలసంధి రంగస్థలం కాదని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు
లాహోర్ కేసు.. ఉప ప్రధాని మనవడిపై సంచలన ఆరోపణలు!