Share News

ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 03:56 PM

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లో కీలక ఇంధన కేంద్రమైన ఇరాన్‌లోని 'ఖర్గ్ ఐలాండ్' సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
Iran Kharg Island Explosions After US Strikes Oil Tanker

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 5: ఖర్గ్ ఐలాండ్ సమీపంలో అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. స్థానికంగా పలు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక ఫార్స్ (Fars) న్యూస్ ఏజెన్సీ తెలిపినప్పటికీ, పేలుళ్లకు గల స్పష్టమైన కారణాలను వెల్లడించలేదు, అటు, ఈ దాడులను ఇరాన్ అధికార వర్గాలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.


మూడోసారి లక్ష్యంగా ఖర్గ్ ఐలాండ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖర్గ్ ఐలాండ్‌పై దాడి జరగడం ఇది మూడోసారి. మొదటి దాడి మార్చిలో ఇరాన్.. హోర్ముజ్ జలసంధిని మూసివేసి గ్లోబల్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలిగించడంతో, అమెరికా ఖర్గ్ ఐలాండ్‌లోని మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే అప్పట్లో ఆయిల్ మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదు.

రెండో దాడి ఏప్రిల్ 7న జరిగింది. ఇరాన్ వైఖరి మారకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల అనంతరం మరోసారి ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఇప్పుడు తాజాగా ఖర్గ్ ద్వీపం సమీపంలోని ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం వల్ల ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఇరాన్ తీరానికి దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ఐలాండ్, ఆ దేశానికి అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం. ఇరాన్ ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్‌లో అత్యధిక శాతం ఈ ద్వీపం ద్వారానే సరఫరా అవుతుంది. చైనా వంటి దేశాలకు ఇక్కడి నుంచే ప్రధానంగా ఆయిల్ రవాణా జరుగుతుంది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వ ఆదాయానికి ఈ ఐలాండ్ వెన్నుముక లాంటిది. చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలు మాత్రమే కాకుండా, ఈ ద్వీపంలో వేలాది మంది కార్మికుల నివాసాలు, చారిత్రక పోర్చుగీస్ కోట, పురాతన క్రైస్తవ మఠం వంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

స్క్రీన్ టైమ్‌ తగ్గేలా చూడటం అవసరం.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన..

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 04:34 PM