Share News

ఆ రూ.9 లక్షల కోట్ల కోసం ఇరాన్ డిమాండ్.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..

ABN , Publish Date - Apr 16 , 2026 | 09:35 PM

Iran Demands Release of $100 Billion Frozen Assets from US sgr spl అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలు త్వరలోనే జరగబోతున్నాయి. యుద్ధం ముగించాలంటే తమ పది షరతులను అంగీకరించాలని ఇరాన్ పట్టుపడుతోంది. ఇతర దేశాలలో స్థంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలనే షరతు వాటిల్లో ఒకటి.

ఆ రూ.9 లక్షల కోట్ల కోసం ఇరాన్ డిమాండ్.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..
Iran frozen assets $100 billion

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలు త్వరలోనే జరగబోతున్నాయి. యుద్ధం ముగించాలంటే తమ పది షరతులను అంగీకరించాలని ఇరాన్ పట్టుపడుతోంది. ఇతర దేశాలలో స్థంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలనే షరతు వాటిల్లో ఒకటి. 1979లో ఇరాన్‌పై అమెరికా తొలిసారి ఆంక్షలు విధించింది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్‌పై క్రమంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి (Iran frozen assets $100 billion).


1979 ఇరాన్ విప్లవం తర్వాత అమెరికా ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అణు కార్యక్రమం, క్షిపణి అభివృద్ధి కారణంగా మరిన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇరాన్ తన స్వంత డబ్బును కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తుల విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఇది ఇరాన్ జీడీపీలో దాదాపు నాలుగో వంతు.


అమెరికా, చైనా, జపాన్, ఇరాక్, యూరప్‌తో సహా పలు దేశాల్లో ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయ్యాయి. అయితే ఆ మొత్తం ఎంత, ఏయే దేశాల్లో ఎంతెంత ఫ్రీజ్ అయ్యాయి అనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జపాన్ సుమారు 1.5 బిలియన్ డాలర్లను, చైనా కనీసం 20 బిలియన్ డాలర్లను, భారతదేశం 7 బిలియన్ డాలర్లను, ఇరాక్ 6 బిలియన్ డాలర్లను తమ ఆధీనంలో ఉంచుకున్నట్టు తెలుస్తోంది (US Iran sanctions assets).


ఇలా ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయాలని మొదటి దఫా చర్చలకు ముందే ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ డిమాండ్ చేశారు (Iran oil money frozen). ఇరాన్ ఆస్తులలో కొన్నింటిని విడుదల చేయడానికి వాషింగ్టన్ అంగీకరించిందని కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనా రెండో దఫా చర్చల సమయంలో ఈ నిధుల విడుదల గురించి టెహ్రాన్ గట్టిగా పట్టుబట్టే అవకాశం కనబడుతోంది.


ఇవి కూడా చదవండి..

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్


వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక


లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..

Updated Date - Apr 16 , 2026 | 09:35 PM