Share News

రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా భారత్.. ప్రతిపాదన అత్యంత సమగ్రమైనదన్న ఉక్రెయిన్

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:08 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం భారత్ చేసిన ప్రతిపాదనపై ఉక్రెయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగు ప్రతిపాదనల్లో భారత్‌ది అత్యంత సమగ్రమైనదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా భారత్.. ప్రతిపాదన అత్యంత సమగ్రమైనదన్న ఉక్రెయిన్
india russia ukraine ceasefire proposal

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న భయంకరమైన యుద్ధానికి స్వస్తి పలికేందుకు భారత్ రంగంలోకి దిగింది. యుద్ధ విరమణ సాధించేందుకు భారత్ పంపిన శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా స్వాగతిస్తూ, ఇది ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలన్నింటిలో అత్యంత సమగ్రమైనదని అని అభివర్ణించారు. India Russia Ukraine Ceasefire Proposal


యుద్ధ విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఇంధన వనరులు, నల్లసముద్రం (Black Sea) పరిధి రెంటికీ వర్తించాలని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. పోర్టులతో సహా అన్ని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు పూర్తిగా ఆగితేనే నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య నేరుగా జరిగే సమావేశం ద్వారా బేషరతు యుద్ధ విరమణ సాధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 10:08 PM