Share News

భారతీయ పైలట్‌పై దాడి.. ఇజ్రాయెల్‌కు ఫ్లైదుబాయ్ విమాన సర్వీసుల నిలిపివేత

ABN , Publish Date - Oct 01 , 2026 | 09:10 AM

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నుంచి దుబాయ్‌కు వెళ్లే ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఎఫ్‌జెడ్ 1073 ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కోపైలట్ కత్తితో దాడిచేసిన నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను రద్దు చేశారు.

భారతీయ పైలట్‌పై దాడి.. ఇజ్రాయెల్‌కు ఫ్లైదుబాయ్ విమాన సర్వీసుల నిలిపివేత
flydubai latest,

ఇంటర్‌నెట్ డెస్క్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నుంచి దుబాయ్‌కు వెళ్లే ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఎఫ్‌జెడ్ 1073 ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కోపైలట్ కత్తితో దాడిచేసిన నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ విషయాన్ని ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దాడి ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, అంతవరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ అధికారులతో ఎప్పటికపుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపింది. దాడి ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకూ యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య విమాన సర్వీసులను నిలిపివేయాలని ఇజ్రాయెల్ భద్రతా సంస్థ షిన్ బెట్ అంతకుముందు సూచించింది. దీంతో ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.


ఇజ్రాయెల్‌లో భద్రత మరింత కట్టుదిట్టం

ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి నేపథ్యంలో తమ దేశంలోకి వచ్చే పైలట్లకు ఇజ్రాయెల్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రతినిధి తెలిపారు. కాగా.. స్మిత్ మచ్చార్‌పై దాడిపై ముందే ఎలాంటి ఊహాగానాలు చేయరాదని, ఆయనపై దాడిపై అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదని ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థ పేర్కొంది. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఊహాగానాలకు తావు లేదని తెలిపింది. ఇక మచార్‌పై దాడిచేసిన కోపైలట్‌ను సౌదీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.


దర్యాప్తులో పాల్గొంటాం: నెతన్యాహు

భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి ఘటనకు సంబంధించిన దర్యాప్తులో పాల్గొంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపారు. యూఏఈతో పాటు తాము కూడా ఆ ఒమన్ కోపైలట్‌ను దర్యాప్తు చేస్తామని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత పైలట్ మచార్‌పై మోదీ, ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు

ఇంధన నౌక హైజాక్‌.. భారతీయుడి హత్య

Updated Date - Oct 01 , 2026 | 11:46 AM