Share News

పశ్చిమాసియాలో యుద్ధం.. లాభపడిన జర్మనీ.. కారణాలేంటి..

ABN , Publish Date - Jul 12 , 2026 | 10:05 AM

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్‌లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది.

పశ్చిమాసియాలో యుద్ధం.. లాభపడిన జర్మనీ.. కారణాలేంటి..
Germany exports

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్‌లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది. 2026 మే నెలలో జర్మనీ ఎగుమతులు అనూహ్యంగా పెరగడం ప్రపంచ ఆర్థిక విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది (Germany exports).


జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇటీవల పార్లమెంటులో ఈ గణాంకాలను వెల్లడించారు. మే నెలలో జర్మనీ ఎగుమతులు గత నెలతో పోలిస్తే 0.9 శాతం పెరిగాయి. ఆర్థిక నిపుణులు ఎగుమతులు తగ్గుతాయని అంచనా వేసినప్పటికీ అందుకు భిన్నంగా వృద్ధి నమోదైంది. ముఖ్యంగా అమెరికా, చైనా నుంచి పెరిగిన డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది (Germany economy).


జర్మనీ తయారు చేసే కార్లు, పరిశ్రమల యంత్రాలు, అధునాతన పరికరాలకు అమెరికాలో భారీ డిమాండ్ ఉంటుంది. మే నెలలో అమెరికాకు జర్మనీ ఎగుమతులు ఏకంగా 23.1 శాతం పెరిగాయి. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, పరిశ్రమలు పెట్టుబడులు పెంచడం, కృత్రిమ మేధ (AI) రంగంలో పెట్టుబడులు పెరగడంతో పరిశ్రమల యంత్రాల అవసరం కూడా పెరిగింది. దీంతో జర్మన్ తయారీ రంగానికి మంచి ఆర్డర్లు లభించాయి. ఇక, చైనాకు జర్మనీ ఎగుమతులు 7.1 శాతం పెరిగాయి. ముఖ్యంగా పారిశ్రామిక యంత్రాలు, రసాయన ఉత్పత్తులు, అధునాతన తయారీ పరికరాల కొనుగోళ్లు పెరగడం ఇందుకు కారణమైంది (US Germany trade).


పశ్చిమాసియాలో యుద్ధం కూడా జర్మనీకి కలిసొచ్చిందనే చెప్పాలి (German exports 2026). హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన ఆందోళనల కారణంగా భవిష్యత్తులో సరఫరా గొలుసు దెబ్బతింటుందనే అంచనాతో అనేక అంతర్జాతీయ కంపెనీలు అవసరమైన వస్తువులను ముందుగానే కొనుగోలు చేశాయి. ఆర్థిక భాషలో దీనిని 'ఫ్రంట్-లోడింగ్' అంటారు. ఈ ముందస్తు ఆర్డర్లు కూడా జర్మనీ ఎగుమతులు పెరగడానికి ఒక ముఖ్య కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..

Updated Date - Jul 12 , 2026 | 10:11 AM