అఫ్గాన్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదు
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:17 AM
అఫ్గానిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.59 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అఫ్గానిస్తా్న్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.59 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఉత్తర అక్షాంశం వద్ద 36.05 డిగ్రీలు, తూర్పు రేఖాంశం వద్ద 68.87 డిగ్రీల వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించామని పేర్కొంది.
భూఉపరితలానికి 125 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వివరించింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 165 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించామని తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని తెలిపింది. భూకంపపరంగా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ చుట్టూ ఉన్న క్రియాశీలక ప్రాంతాల్లో హిందూ కుష్ ప్రాంతం కూడా ఒకటి.
గత కొద్ది సంవత్సరాల్లో హిందూ కుష్ ప్రాంతంలో పలుమార్లు భూకంపాలు వచ్చాయి. వాటిని అంతర్జాతీయ, ప్రాంతీయ భూకంప కేంద్రాల సంస్థలు రికార్డు చేశాయి. అఫ్గానిస్తాన్ భూకంపాలకు గురవడానికి ప్రధాన కారణం అది ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప మండలాల్లో ఒకటిగా ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంది. దీంతో ఆ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
ఈ వార్తలనూ చదవండి:
భారత పైలట్ మచార్‌పై మోదీ, ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
ఇంధన నౌక హైజాక్.. భారతీయుడి హత్య