Share News

డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీకి 27 ఏళ్లకు పైగా జైలు శిక్ష!

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:59 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్యచేసేందుకు కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తికి అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టు కఠిన శిక్ష విధించింది. ట్రంప్‌ను అంతం చేయాలని పథకం పన్నిన ఆసిఫ్ మర్చంట్‌ అనే పాకిస్థాన్ వ్యక్తికి 27 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీకి 27 ఏళ్లకు పైగా జైలు శిక్ష!
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్యచేసేందుకు కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తికి అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సులేమాన్ హత్యకు ప్రతీకారంగా ట్రంప్‌ను అంతం చేయాలని పథకం పన్నిన ఆసిఫ్ మర్చంట్‌ అనే పాకిస్థాన్ వ్యక్తికి 27 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.


ట్రంప్‌ను హత్య చేసేందుకు అమెరికాలో ఒక రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ ఉన్నతాధికారిని కిరాయి హంతకులుగా నియమించుకోవడానికి ఆసిఫ్ ప్రయత్నించినట్లు కోర్టు విచారణలో తేలింది. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్న ఆసిఫ్.. 2024 జూలై 12న దేశం విడిచి వెళ్లేందుకు ప్రణాళిక రచిస్తుండగా ఎఫ్‌బీఐ అధికారులు పట్టుకున్నారు. అయితే టెహ్రాన్‌లోని తన కుటుంబాన్ని రక్షించుకునేందుకే తాను ఈ కుట్రలో బలవంతంగా భాగమయ్యానని ఆసిఫ్ వాదించాడు. నిర్ధిష్టమైన వ్యక్తిని చంపమని తనకు ఇరాన్ నుంచి ఎప్పుడు ఆదేశాలు రాలేదని, డొనాల్డ్ ట్రంప్‌తో పాటు జో బైడెన్, నిక్కీ హేలీ పేర్లను మాత్రం ప్రస్తావించినట్లు తెలిపాడు.


అయితే, ఈ కుట్ర ప్రధానంగా అధ్యక్షుడు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే జరిగిందని అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె స్పష్టం చేశారు. విదేశీ ఉగ్రవాద శక్తులు తమ దేశ నాయకులను లక్ష్యంగా చేసుకునే కుట్రలను ఎంతమాత్రం సహించబోమని తెలిపారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టే వరకు విశ్రమించమని బ్లాంచె హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం అనుసరించే వ్యూహంలో భాగంగానే ఆసిఫ్‌ను ఉపయోగించినట్లు యూఎస్ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

Updated Date - Nov 18 , 2026 | 09:52 AM