ఘోర పడవ ప్రమాదం.. రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:18 PM
ఆఫ్రికాలోని కాంగో ప్రాంతం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాంగో నదిలో రెండు పడవలు ఢీకొన్న ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికాలోని కాంగో ప్రాంతం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాంగో నదిలో రెండు పడవలు ఢీకొన్న ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారని సమాచారం. ఒక పడవ ఉబాంగి నుంచి దేశ రాజధాని కిన్షాషాకు, మరొకటి కిన్షాషా నుంచి లూకోలెలాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
మధ్య ఆఫ్రికా దేశంలో పడవ ప్రమాదాలు సర్వసాధారణం. వీటికి తరచుగా రాత్రిపూట ప్రయాణాలు, రద్దీగా ఉండే పడవలే కారణమని స్థానికులు ఆరోపిస్తుంటారు. ఇటీవలి సంవత్సరాలలో పడవ ప్రమాదాలలో వందలాది మంది మరణించడానికి, దేశంలోని మారుమూల ప్రాంతాలలో పేలవమైన భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల కొరత కూడా దోహదపడుతున్నాయి. ఇటీవల పరీక్షలు రాసిన విద్యార్థులను తిరిగి తీసుకువస్తున్న ఒక చెక్క పడవ ఆఫ్రిక మధ్య ప్రాంతంలో మునిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించారు. ఆ పడవ కసాయి ప్రావిన్స్‌లో ప్రయాణిస్తుండగా, సంకురు, కసాయి నదుల సంగమంలోకి ప్రవేశిస్తున్న సమయంలో మునిగిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
జేఈఈ మెయిన్- 2027 జనవరి సెషన్ పరీక్షా తేదీలు విడుదల.. వివరాలివే..
నికోలస్ పూరన్ విధ్వంసం.. టొరంటో సిక్సర్స్‌కు కెనడా సూపర్ 60 టైటిల్
ఫామ్-6 మార్పులు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు..