Share News

ఫామ్‌-6 మార్పులు.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు..

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:31 PM

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఫామ్‌-6 మార్పులు.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు..
Rahul Gandhi, Gyanesh Kumar

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫామ్-6లో మార్పులను జ్ఞానేశ్ కుమార్‌ చట్టవిరుద్ధంగా, బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ గాంధీ స్పందించారు (Rahul Gandhi, Gyanesh Kumar).


ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన ఫామ్-6లో చేసిన మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. 'మార్చిన ఫామ్-6లో ఏదీ మేం ఆమోదించలేదు. ఎవరు మార్చారో రికార్డులు వచ్చిన తర్వాత చూడాలనుకుంటున్నాం' అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫామ్-6ను ఎవరి అనుమతితో మార్చారో తెలుసుకునేందుకు సంబంధిత రికార్డులను కోర్టు కోరింది (Form 6, Election Commission).


సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు చేశారు. ఫామ్-6ను ఆయన చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా మార్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తన పదవిని దుర్వినియోగం చేసి బీజేపీకి ప్రయోజనం కలిగించేలా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో భాగమైన వారందరినీ బాధ్యులను చేస్తామని ఆయన పేర్కొన్నారు (Supreme Court, SIR).


మరోవైపు, ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎన్నికల సంఘంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో తీసుకున్నవా, లేక ఒక్క సీఈసీ మాత్రమే నిర్ణయించారా అనే వివరాలను కోర్టు కోరింది.


ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..


మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 05 , 2026 | 06:38 PM