చిత్రకూట్‌లో జల విలయం
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:03 AM
మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మందాకినీ నది ప్రమాదకర స్థాయిని మించి 13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో...
2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వరద
భోపాల్, ఆగస్టు 30: మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మందాకినీ నది ప్రమాదకర స్థాయిని మించి 13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఇళ్లు, హోటళ్లు, భవనాలు, ఆలయాలు నీటమునిగాయి. ప్రజలు ఎత్తైన భవనాలపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. నయాగావ్‌లోని రామ్‌ఘాట్, హనుమాన్ ధారాలను కలిపే 300 మీటర్ల పొడవైన వంతెనలోని కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు స్థంభించిపోయాయి. వరదల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారులు సుమారు వెయ్యిమందిని కాపాడి సహాయ శిబిరాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత వైమానిక దళం హెలికాఫ్టర్ల సాయంతో బాధితులను రక్షించింది. కుండపోత కొనసాగుతుందన్న హెచ్చరికలతో అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News