బంగ్లాదేశ్‌లో హైఅలర్ట్.. అవామీ లీగ్ ఆవిర్భావానికి ముందు ఉద్రిక్తత భయం!
ABN , Publish Date - Jun 21 , 2026 | 09:58 PM
బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం అయ్యాయి. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చన్న అనుమానాల మధ్య పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం(జూన్ 23) సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో భద్రతా పరిస్థితులు కట్టుదిట్టం అయ్యాయి. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చన్న అనుమానాల మధ్య పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. నిషేధానికి గురైన ఈ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో జెండాలు ఎగురవేయడం సహా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవచ్చని భద్రతా వర్గాలు హెచ్చరించాయి.
ఆ దేశ హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న దేశంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అన్ని భద్రతా సంస్థలను అప్రమత్తం చేశామని అహ్మద్ తెలిపారు. 'భద్రతా బలగాలు కీలక ప్రాంతాల్లో మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని హోంమంత్రి చెప్పారు. అయితే.. ఇప్పటికైతే ఎలాంటి ముప్పూ లేదన్న అధికార యంత్రాంగం.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది.
నిషేధిత రాజకీయ కార్యకలాపాల నేపథ్యంలో.. కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తే ప్రత్యర్థి వర్గాలతో ఘర్షణలు తలెత్తే అవకాశముందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమంతో ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీ కార్యకర్తలతో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదమున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అవామీ లీగ్ అధికారికంగా ఏ కార్యక్రమాన్ని ప్రకటించకపోయినా, అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
ఇవీ చదవండి:
రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?
భారత్ - ఈయూ ఫ్రీ ట్రేడ్ డీల్.. డిసెంబర్‌లో సంతకాలు!