Share News

ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు.. కుటుంబానికి సంతోషంతో పాటు వింత కష్టం!

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:23 PM

ఆస్ట్రేలియాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే ఆనందంతో పాటు ఈ కుటుంబ సభ్యులకు వింత సమస్య ఎదురైంది.

ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు.. కుటుంబానికి సంతోషంతో పాటు వింత కష్టం!
Australia Quadruplet Birth

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే ఆనందంతో పాటు ఈ కుటుంబ సభ్యులకు వింత సమస్య ఎదురైంది. .ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న ఆ దంపతుల కుటుంబంలో ఇప్పుడు మొత్తం ఏడుగురు పిల్లలు ఉండగా.. కుటుంబ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఒకేసారి నలుగురు శిశువులు పుట్టడం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఆశీర్వాదమని ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ కుటుంబానికి సంతోషంతో పాటూ వింత సమస్య వచ్చి పడింది.


ఏడుగురు పిల్లలతో కలిసి ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారు సరిపోకపోవడంతో 10 సీట్ల వ్యాన్ కొనుగోలు కోసం ఆ పిల్లల తల్లి ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ ప్రారంభించింది. అంతేకాకుండా డైపర్లు, పాలు, దుస్తులు వంటి రోజువారీ అవసరాల ఖర్చులు కూడా భారీగా పెరిగాయని కుటుంబం తెలిపింది. ఈ కష్ట సమయంలో స్నేహితులు, శ్రేయోభిలాషులు సహాయం అందిస్తుండగా, పిల్లలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంపైనే ప్రస్తుతం తమ పూర్తి దృష్టి ఉందని ఆ దంపతులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

అప్పుడు రోహిత్ శర్మ చెప్పిన మాటలు నమ్మలేదు: సంజు శాంసన్

అన్నం తింటే బరువు పెరుగుతారా?

Updated Date - Jul 21 , 2026 | 05:49 PM