వాషింగ్టన్‌లో కాల్పులు.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 09:43 PM
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు. వైట్‌హౌస్‌కు సమీపంలోని ప్రముఖ నివాస, వాణిజ్య ప్రాంతం లోగన్ సర్కిల్‌లో గురువారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు. వైట్‌హౌస్‌కు సమీపంలోని ప్రముఖ నివాస, వాణిజ్య ప్రాంతం లోగన్ సర్కిల్‌లో గురువారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం ఐదుగురిపై కాల్పులు జరపగా.. ఒకరు మృతి చెందారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలియడంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు.
వైట్‌హౌస్‌కు ఉత్తరాన ఒక మైలు దూరంలో ఉన్న 15వ స్ట్రీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అటువైపు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. అలాగే సమీపంలోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో జిమ్, చర్చి, నివాస భవనాలు, సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ముందుగా అనుమానితుడు జిమ్‌లోకి చొరబడి ఒకరిపై కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. తర్వాత బయటకు వచ్చి మళ్లీ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. సమీపంలోని పార్కింగ్ గ్యారేజీ లిఫ్ట్‌లో మరో వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. తర్వాత ఓ అపార్ట్‌మెంట్ భవనంలోని ఏడో అంతస్తులోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
కాగా.. దుండగుడు జిమ్‌లో కాల్పులు జరిపిన సమయంలో సుమారు 50 మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో అతను ఫైరింగ్ చేశాడని, బుల్లెట్ తగిలిన ఓ వ్యక్తి రక్తపు మడుగులో నేలపై కుప్పకూలిపోయాడని చెప్పారు. దీంతో తనతో పాటు అక్కడున్న ఇతరులు ప్రాణభయంతో జిమ్ నుంచి బయటకు పరుగులు తీశామని తెలిపారు. జిమ్‌లో రెండు రౌండ్లు, బయట ఐదు నుంచి ఆరు రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించిందని చెప్పారు. మరోవైపు కాల్పులు జరిపిన దుండగుడి కోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మెట్రోపాలిటన్ డిపార్ట్‌మెంట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
కొంపముంచిన ఎఫైర్.. ఎన్విడియా సీఈఓ రాజీనామా
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?