ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:18 PM
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఎఫైర్ గురించి ఆయన కూతురికి తెలిసే ఉంటుందని తైవాన్ మీడియాలో విశ్లేషణలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఎఫైర్ ఉదంతం కలకలం రేపుతోంది. ఆయనకు దగ్గరైన ఆలిస్ అనే మహిళ చైనా గూఢచారిణి అని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయి. అయితే, సీఈఓ ఎఫైర్ విషయం ఆయన కూతురు మాడిసన్‌కు కూడా తెలిసే ఉంటుందని తైవాన్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. ప్రస్తుతం మాడిసన్ ఎన్విడియాలో ప్రాడక్ట్ మార్కెటింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2025లో తైవాన్‌లో ఓ కార్యక్రమానికి జెన్సన్ హువాంగ్, ఆలిస్ కలిసి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మాడిసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని వీడియోల ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియోల్లో జెన్సన్ ఆలిస్‌లు క్లోజ్‌గా కనిపించారని తైవాన్ మీడియా పేర్కొంది. కూతురి ముందరే వారు కలుపుగోలుగా ఉన్నారని వ్యాఖ్యానించింది. ఆలిస్ చుట్టూ చేయి వేసి జెన్సన్ నిలబడ్డ వైనాన్ని ప్రస్తావించింది. ఆ తరువాత ఆమె బుగ్గపై చుంబించారని కూడా తెలిపింది. ఆ కార్యక్రమంలో మాడిసన్‌తో పాటు ఆమె భర్త కూడా ఉన్నారు. మాడిసన్ కూడా ఆలిస్‌తో స్నేహంగా ఉన్నట్టే కనిపించిందని తైవాన్ మీడియా వ్యాఖ్యానించింది.
జెన్సన్ వ్యవహారం గురించి ఆయన కుటుంబసభ్యులకు తెలిసే ఉంటుందని చివరకు నిర్ధారణకు వచ్చింది. వ్యూహాత్మకంగానే వారు జెన్సన్ బంధానికి అంగీకారం తెలిపి ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే జెన్సన్‌కు మరో యువతితో కూడా ఎఫైర్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో, ఆయనను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు ఎన్విడియా సిద్ధం అవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..
ఎన్విడియా నుంచి తీసేస్తే నేను ఉద్యోగం ఇస్తా.. అది నాకు గౌరవం: మస్క్