Share News

కొంపముంచిన ఎఫైర్.. ఎన్విడియా సీఈఓ రాజీనామా

ABN , Publish Date - Nov 12 , 2026 | 07:44 PM

చైనా గూఢచారిణితో ఎఫైర్‌ కలకలానికి దారి తీసిన నేపథ్యంలో ఎన్విడియా సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ తాజాగా రాజీనామా చేశారు.

కొంపముంచిన ఎఫైర్.. ఎన్విడియా సీఈఓ రాజీనామా
Nvidia CEO Jensen Huang Resignation

ఇంటర్నెట్ డెస్క్: చైనా గూఢచారిణిగా అనుమానాలున్న మహిళతో వివాహేతర సంబంధంతో చిక్కుల్లో పడ్డ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తాజాగా సంస్థ నుంచి తప్పుకున్నారు. సంస్థ సీఈఓగా ఆయన రాజీనామా చేశారు. సంస్థ అధ్యక్ష పదవి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు (Nvidia CEO Jensen Huang Resignation). ఈ విషయాన్ని సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో, సంస్థతో 33 ఏళ్ల పాటు సాగిన జెన్సన్ హువాంగ్ ప్రయాణానికి ముగింపు పడింది.

ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన కోలెట్ క్రెస్ మధ్యంతర సీఈఓగా నియమితులయ్యారు. తదుపరి సీఈఓను ఎంపిక చేసే వరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. తదుపరి సీఈఓ కోసం సంస్థ ఇప్పటికే అన్వేషణ ప్రారంభించింది. బయటి వ్యక్తులను లేదా సంస్థలోని ఉన్నతాధికారులను సీఈఓగా నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.


ఎవరీ కోలెట్ క్రెస్..

కోలెట్ క్రెస్ 2013లో ఎన్విడియాలో చేరారు. గత 13 ఏళ్ల కాలంలో సంస్థ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఎన్విడియాలో చేరకమునుపు ఆమె 25 ఏళ్ల పాటు సిస్కో, మైక్రోసాఫ్ట్ వంటి పలు టెక్ దిగ్గజ సంస్థల్లో కీలక స్థానాల్లో పని చేశారు. గ్రాఫిక్ కంప్యూటర్స్ చిప్స్ సంస్థగా పేరొందిన ఎన్విడియాను ఏఐ చిప్స్‌ తయారీ సంస్థగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు. హువాంగ్ వేసిన పునాదులే ఆలంబనా ఎన్విడియాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని ఆమె చెప్పారు.


సంస్థ నాయకత్వంలో కీలక మార్పు..

హువాంగ్ రాజీనామా నేపథ్యంలో ఎన్విడియా నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్‌గా హార్వీ సీ జోన్స్ నియమితులయ్యారు. వ్యాపారవేత్తగా, టెక్నాలజీ రంగ నిపుణుడిగా జోన్స్‌కు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. మధ్యంతర సీఈఓగా నియమితులైన కోలెట్‌పై జోన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థ వ్యాపారం, కస్టమర్ల అవసరాలు, కార్యకలాపాలు, ఆర్థికస్థితిపై ఆమెకు లోతైన అవగాహన ఉందని చెప్పారు. సంస్థలో సీనియర్ అధికారులు ఆమెకు వెన్నుదన్నుగా ఉంటారని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 08:30 PM