Share News

2026 ఆర్థిక శాస్త్ర నోబెల్ విజేతలు వీరే.. ఇద్దరు అమెరికన్ ఆర్థికవేత్తలకు పురస్కారం!

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:19 PM

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ ఇద్దరికి దీనిని అందించనుంది.

2026 ఆర్థిక శాస్త్ర నోబెల్ విజేతలు వీరే.. ఇద్దరు అమెరికన్ ఆర్థికవేత్తలకు పురస్కారం!
Nobel Prize in Economics

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కార విభాగాల్లో చివరిదైన ఆర్థిక శాస్త్రంలో విజేతలు ఎవరో వెల్లడైంది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆర్ధిక శాస్ట్రంలో నోబెల్ విజేతలను ప్రకటించింది. ఇదే విభాగంలో గతేడాది ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అందగా.. ఈ సారి ఇద్దరికి దీనిని అందించనున్నారు. ‘స్థూల ఆర్థిక స్థిరీకరణకు సూక్ష్మ ఆర్థిక పునాదులు’ అంశంపై పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఇ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్‌లు 2026 నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.


కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్‌ ఇ.హాల్‌.. 1967లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మసాచుసెట్స్‌కు చెందిన వుడ్‌ఫోర్డ్ సైతం ఎమ్‌ఐటీ నుంచి 1983లో పీహెచ్‌డీ పట్టా పొందారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరు అభివృద్ధి చేసిన కొత్త ఆర్థిక నమూనాల ఆధారంగా.. సరైన సమయంలో తీసుకునే ఆర్థిక, ద్రవ్య విధాన చర్యలు ఆర్థిక వ్యవస్థలోని హెచ్చుతగ్గులను తగ్గించగలవని నిరూపితమయ్యాయి. ఈ పరిశోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక నమూనాలకు ఒక బలమైన, సుస్థిరమైన తాత్విక పునాది లభించిందని నోబెల్ ప్రైజ్ కమిటీ ఛైర్మన్ జాన్ హాస్లర్ ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్

ఢిల్లీలో ఇండియా కూటమి నేతల పాదయాత్ర ప్రారంభం

మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు

Updated Date - Oct 12 , 2026 | 04:46 PM