Share News

అధిక శబ్దంపై వివాదం.. తల్లి ఆదేశంతో యువతిని కాల్చి చంపిన పదేళ్ల కొడుకు

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:38 PM

అమెరికాలో ఓ యువతిని పదేళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు. న్యూమెక్సికో రాష్ట్రంలోని అల్బుకెర్కీ సిటీలో గత నెల 31న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పులకు సంబంధించిన వీడియోను పోలీసులు శుక్రవారం విడుదల చేశారు.

అధిక శబ్దంపై వివాదం.. తల్లి ఆదేశంతో యువతిని కాల్చి చంపిన పదేళ్ల కొడుకు

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ యువతిని పదేళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు. న్యూమెక్సికో రాష్ట్రంలోని అల్బుకెర్కీ సిటీలో గత నెల 31న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పులకు సంబంధించిన వీడియోను పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 31న ఎలైనా గోమెజ్ విలెడా (40) తన ఇంట్లో భారీ శబ్దం పెట్టి హాలోవీన్ వేడుక జరుపుకుంటున్నారు. పొరుగింటి వారికి ఆ శబ్దం ఇబ్బంది కలిగించింది. దీంతో పొరుగింటికి చెందిన కెరలిన్ ప్లాజా రాంజెల్ (16) అనే యువతితో పాటు మరో మహిళ గోమెజ్ ఇంటికి వెళ్లారు. సౌండ్ తగ్గించాలని వారు కోరడంతో గోమెజ్, పొరుగింటి యువతుల మధ్య వాగ్వాదం తలెత్తింది. క్రమంగా ఇది దెబ్బలాటకు దారితీసింది. ముగ్గురూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.


తల్లి చెప్పడంతో కొడుకు కాల్పులు

గొడవ జరుగుతుండగా.. ఇంట్లో తన హ్యాండ్‌గన్ తీసుకురావాలని గోమెజ్ తన కొడుకుకు చెప్పింది. అతను వెంటనే లోపలికి వెళ్లి గన్ తీసుకొచ్చాడు. తన తల్లిపై దాడి చేస్తున్న ఇద్దరిపై గురిపెట్టాడు. తల్లి చెప్పడంతో అతను రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రాంజెల్ చనిపోయింది. ఈ ఘటనను రాంజెల్ తండ్రి కీనర్ తన ఇంట్లో నుంచి చూశారు. వెంటనే ఆయన కూడా కోపంతో గోమెజ్ ఇంటికి వెళ్లారు. ఆ టైంలో గోమెజ్ తన కొడుకు చేతిలోంచి తుపాకీ తీసుకుని ఆయన వైపు కాల్పులు జరిపింది. తర్వాత గోమెజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి రాంజెల్ రక్తపు మడుగులో పడి ఉంది. తర్వాత పోలీసులు కాల్పులు జరిపి గోమెజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే, యువతిని చంపిన ఆమె కొడుకుపై ఇంకా కేసు నమోదు చేయలేదు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 20 , 2026 | 07:18 PM