Share News

రోజూ వర్క్‌ఔట్ చేస్తున్నారా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి.!

ABN , Publish Date - Feb 03 , 2026 | 08:14 AM

మీరు రోజూ వర్క్‌ఔట్ చేస్తున్నారా? అయినా ఫలితం కనిపించడం లేదా? అయితే వ్యాయామానికి ముందు, తర్వాత తీసుకునే ఆహారమే మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా?

రోజూ వర్క్‌ఔట్ చేస్తున్నారా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి.!
Workout Diet Plan

ఇంటర్నెట్ డెస్క్: ఫిట్‌గా ఉండాలని, బరువు తగ్గాలని రోజూ వ్యాయామం చేసే వారు చాలామందే ఉన్నారు. అయితే, వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం, తర్వాత తీసుకునే ఆహారంపై కొంతమంది శ్రద్ధ చూపరు. దీని వల్ల ఆశించిన ఫలితాలు ఆలస్యం అవుతాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.


తినకుండా వ్యాయామం చేస్తున్నారా?

త్వరగా బరువు తగ్గాలనే ఆతృతలో కొంతమంది పూర్తిగా ఖాళీ కడుపుతో కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు అవసరానికి మించి తినేస్తారు. ఈ రెండు అలవాట్లు శరీరానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం శక్తినివ్వడమే కాకుండా, కండరాల నష్టం జరగకుండా కాపాడుతుందని చెబుతున్నారు.

వ్యాయామానికి 1-2 గంటల ముందు కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్ ఉన్న తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఇది కండరాలకు శక్తినిచ్చి అలసటను తగ్గిస్తుంది, మెరుగైన పనితీరుకు సహాయపడుతుంది. అరటిపండు, ఓట్స్ వంటివి తీసుకోవాలి. వ్యాయామానికి, తర్వాత తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం. ఉదయం వ్యాయామం చేసే వారు ప్రీ వర్క్‌ఔట్‌గా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


వర్క్‌ఔట్ తర్వాత తప్పనిసరిగా తినాలా?

వ్యాయామం తర్వాత ప్రొటీన్ తీసుకోవడం చాలా అవసరం. ఇది వ్యాయామ సమయంలో దెబ్బతిన్న కండరాల ఫైబర్లను సరిచేసి, కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. వర్క్‌ఔట్ తర్వాత 30 నిమిషాల నుంచి 2 గంటలలోపు సుమారు 20-40 గ్రాముల ప్రొటీన్ తీసుకోవడం ఉత్తమం. పాలు, అరటిపండు, ఖర్జూరాలు, పండ్లు, ఓట్స్, వంటి ఆహారాలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 03 , 2026 | 08:24 AM