Share News

యూరిన్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టే ఆహారం.. ఏంటో తెలుసా?

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:21 PM

యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కేవలం మంట మాత్రమే కాకుండా, అది శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. తరుచూ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం.

యూరిన్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టే ఆహారం.. ఏంటో తెలుసా?
Urine Infection Remedies

ఇంటర్నెట్ డెస్క్: యూరిన్ ఇన్ఫెక్షన్ (UTI) సమస్య రాకుండా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం, నీరు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్ఫెక్షన్(infection) మూత్రనాళం నుంచి కిడ్నీలకు పాకితే అది చాలా ప్రమాదం, దీని వల్ల కిడ్నీలు( kidneys) దెబ్బతినే అవకాశం ఉంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినపుడు మందులతో పాటు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా త్వరగా నశించి, ఉపశమనం లభిస్తుంది.


1.నీరు, కొబ్బరి నీళ్లు:

యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినపుడు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు త్రాగాలి. ఇది మూత్రం ద్వారా బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది. కొబ్బరి నీళ్లు శరీరానికి చలువ చేస్తాయి. మూత్ర విసర్జన మంట రాకుండా సాఫీగా అయ్యేలా చూస్తాయి. బార్లీ నీరు యూరిన్ ఇన్ఫెక్షన్‌కు ఇది అద్భుతమైన చిట్కా. బార్లీ గింజలను నీటిలో మరిగించి, ఆ నీటిని త్రాగడ వల్ల శరీరం చల్లబడటమే కాదు.. మూత్ర విసర్జన సమయంలో మంట తగ్గుతుంది.

food1.jpg

2. క్రాన్‌బెర్రీ జ్యూస్:

యూరిన్ ఇన్ఫెక్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మందు ఇది. ఇందులో ఉండే పదార్ధాలు బ్యాక్టీరియా మూత్రనాళ గోడలకు అతుక్కొకుండా నిరోధిస్తాయి. క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. తాజా క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగితే చాలా మంచిది.

garbari juse.jpg

3.పెరుగు, మజ్జిగ:

పెరుగు, మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో హానికర బ్యాక్టీరియాలతో పోరాడి మూత్ర ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. పెరుగు చిక్కగా ఉండి పోషకాలు అందిస్తే, మజ్జిగ తక్కువ కొవ్వుతో శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుతుంది. పెరుగులో కాస్త పంచదార వేసుకొని, పైనాపిల్ ముక్కలను నేరుగా తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

card.jpg


4. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు:

సిట్రస్ పండ్లు అంటే నిమ్మ, నారింజ, కివీ. వీటిలో విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఇన్ఫెక్షన్లు నివారించడంలో సహాయపడతాయి. కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

lemon.jpg

5.అనాస పండు, దోసకాయ:

అనాస పండులో ‘బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో వాపును తగ్గించడమే కాకుండా, యాంటీబయాటిక్స్ బాగా పనిచేయడానికి సహకరిస్తుంది. ఇన్ఫెక్షన్ సమయంలో ఇది తీసుకోవడం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుతుంది. మూత్రం ద్వారా బ్యాక్టీరియాను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే వారు దోసకాయ తినడం చాలా మంచిది.

dosakaya.jpg

6. దాల్చిన చెక్క, మెంతులు:

దాల్చిన చెక్కలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంటుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ లో బ్యాక్టీరియా వృద్దిని అడ్డుకుంటుంది. దాల్చిన చెక్కను ఎక్కువగా వంటల్లో వాడుతుంటారు. మెంతులు శరీరానికి చలువ చేస్తాయి. ఇవి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి

menturl.jpg


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 02 , 2026 | 07:01 PM