Morning Walk in Winter: శీతాకాలం.. మార్నింగ్ వాక్‌కి వెళ్లడం మంచిదేనా?
ABN , Publish Date - Jan 10 , 2026 | 08:06 AM
చలికాలం వచ్చిందంటే చాలా మందికి మార్నింగ్ వాక్ చేయాలా.. వద్దా.. అనే సందేహం మొదలవుతుంది. చల్లని గాలి, పొగమంచు కారణంగా బయటకు వెళ్లేందుకు కొంత వెనుకాడుతుంటారు..
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదే. చల్లని వాతావరణం వల్ల శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
చలికాలంలో ఉదయం ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేరుగా బయటకు వెళ్లకుండా.. ముందుగా ఇంట్లో తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం మంచిది. పూర్తిగా వేడి దుస్తులు ధరించి మాత్రమే బయటకు వెళ్లాలి.

మార్నింగ్ వాక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
బరువు నియంత్రణలో ఉంటుంది..
షుగర్, బీపీ వంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి..
మానసిక ప్రశాంతత లభిస్తుంది..
అయితే పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదు. సూర్యోదయం తర్వాత వాతావరణం కొంచెం తేలికపడినప్పుడు వాకింగ్ చేయడం ఉత్తమం. వాకింగ్‌కు వెళ్ళేటప్పుడు గ్లౌజులు, మఫ్లర్, స్వెట్టర్ తప్పనిసరిగా ధరించండి. ముందుగా 5 నిమిషాలు వార్మప్ చేయండి. నెమ్మదిగా నడక మొదలుపెట్టి తర్వాత వేగం పెంచండి. నీళ్లు తాగడం మర్చిపోవద్దు. అస్వస్థతగా అనిపిస్తే వెంటనే ఆపేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News