Share News

తినేటప్పుడు చెమట పట్టడం డయాబెటిస్‌కు సంకేతమా?

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:54 AM

తినేటప్పుడు చెమటలు పట్టడం చాలామందికి సాధారణ సమస్యలా అనిపించొచ్చు. కానీ వాతావరణంతో సంబంధం లేకుండా భోజనం చేసే సమయంలో చెమటలు ఎక్కువగా వస్తుంటే.. అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు.

తినేటప్పుడు చెమట పట్టడం డయాబెటిస్‌కు సంకేతమా?
Sweating While Eating

ఇంటర్నెట్ డెస్క్: కొంతమందిని గమనిస్తే వాతావరణం ఎలా ఉన్నా.. తినేటప్పుడు మాత్రం చెమటలు పడుతుంటాయి. ముఖ్యంగా నుదిటిపై, ముఖం చుట్టూ ఎక్కువగా చెమట కనిపిస్తుంది. చాలా మంది దీనిని కేవలం వేడి లేదా కారంగా ఉన్న ఆహారం వల్లే అనుకుంటారు. కానీ సాధారణ భోజనం తిన్నా, చల్లని వాతావరణంలో ఉన్నా కొందరికి చెమటలు పడుతుంటాయి.


కొంతమందికి తినేటప్పుడు తేలికగా చెమట పట్టడం సహజమే. కానీ మరికొందరికి మాత్రం ఇది ఎక్కువగా, పదే పదే జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ సమస్యను గస్టేటరీ స్వెటింగ్ అంటారు. ఎక్కువగా కారంగా ఉండే ఆహారం తినేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడతాయి. ముఖ్యంగా వేడి శరీర స్వభావం ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో ఇది సాధారణమే అయినా, మరికొందరిలో ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు.

డయాబెటిస్?

నిపుణుల ప్రకారం.. భోజనం చేస్తున్నప్పుడు ఎక్కువగా చెమటలు పట్టడం కొన్నిసార్లు మధుమేహం(డయాబెటిస్) ప్రారంభ లక్షణం కావచ్చు. ఎక్కువ కాలం డయాబెటిస్ ఉంటే నరాలకు నష్టం కలగవచ్చు. దానివల్ల తినేటప్పుడు చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు లేదా హార్మోన్ల మార్పుల సమయంలో కూడా ఈ సమస్య కనిపించవచ్చు.


పిల్లల్లోనూ ఈ సమస్య ఉంటుందా?

పిల్లలు తినేటప్పుడు చెమటలు పట్టడం సాధారణమే అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కారంగా ఉండే ఆహారం తినేటప్పుడు జీర్ణక్రియ కోసం శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడతాయి. కానీ పిల్లలు సాధారణ ఆహారం తినేటప్పుడూ ఎక్కువగా చెమటలు పడుతుంటే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?

  • తినేటప్పుడే ఎక్కువగా చెమటలు వస్తున్నా

  • కారణం లేకుండా బరువు తగ్గుతున్నట్లయితే

  • భోజనం సమయంలో గుండె దడ పెరుగుతుంటే

  • చెమటలు చాలా ఎక్కువగా వస్తుంటే

పైన పేర్కొన్న సందర్భాలలో వైద్యులను సంప్రదించడం మంచిది.

ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి?

  • కారం ఎక్కువగా ఉన్న ఆహారం తినకండి.

  • చిన్న చిన్నగా, తేలికపాటి భోజనం చేయండి.

  • మానసిక ఒత్తిడి తగ్గించుకోండి.

  • రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగండి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 05 , 2026 | 11:20 AM