Share News

ఫిట్‌నెస్‌ కోసం 5 బెస్ట్ డెజర్ట్‌లు ఇవే..

ABN , Publish Date - Feb 05 , 2026 | 08:22 AM

ఈ ఐదు డెజర్ట్‌లు ఆరోగ్యకరంగా ఉండటంతో పాటూ తీపి కోరికను కూడా తీర్చుతాయి. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో వీటిని త్వరగా తయారు చేసుకోవచ్చు..

ఫిట్‌నెస్‌ కోసం 5 బెస్ట్ డెజర్ట్‌లు ఇవే..
Healthy Desserts For Fitness

ఇంటర్నెట్ డెస్క్: ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారు ఎక్కువ కొవ్వు లేదా చక్కెర ఉన్న స్వీట్లు సాధారణంగా తినరు. కానీ అప్పుడప్పుడూ తీపి తినాలనిపిస్తుంది కదా.. అలాంటి సమయాల్లో ఈ డెజర్ట్‌లు తినడం మంచిది. ఇవి తక్కువ కొవ్వుతో ఉంటాయి, తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు.


పెరుగుతో కూడిన పండ్ల డెసర్ట్..

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుంది. పెరుగులో తరిగిన తాజా పండ్లు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, స్వల్పంగా తేనె వేసి బాగా కలిపితే చాలు. ఇది ఫిట్‌నెస్ ఇష్టపడేవారికి చక్కటి డెజర్ట్ అవుతుంది.

Fruits (2).jpg

రాగి బెల్లం పాయసం..

ఒక టేబుల్ స్పూన్ రాగి పిండిని నీటిలో కలిపి, తక్కువ మంటపై కలుపుతూ ఉడికించాలి. ముద్దలా అయ్యాక అర టీస్పూన్ తురిమిన బెల్లం, చిటికెడు నెయ్యి వేసి కలపాలి. చివరగా కొద్దిగా గింజలు వేసి వేడిగా తినొచ్చు.


అరటిపండు ఓట్స్ ఖీర్

తక్కువ కొవ్వు ఉన్న పాలలో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ ఉడికించాలి. తరువాత అరటిపండును మెత్తగా చేసి కలపాలి. చిటికెడు ఏలకుల పొడి, తరిగిన బాదం, జీడిపప్పు వేసితే రుచి ఇంకా బాగుంటుంది.

Banana.jpg

కొబ్బరి పాలు చియా సీడ్ కప్..

చియా గింజలను కొబ్బరి పాలలో కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత తేనె, వెనిల్లా ఎసెన్స్ వేసి చల్లగా వడ్డించాలి. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా కలపవచ్చు.

Chia seed.jpg

పనీర్ ఆపిల్ బౌల్..

తక్కువ కొవ్వు ఉన్న పాలతో చేసిన పనీర్‌ను తురుముకోవాలి. ఆపిల్ తరిగి పాన్‌లో మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పనీర్ వేసి చిటికెడు దాల్చిన చెక్క పొడి చల్లాలి. మంట ఆపిన తర్వాత కొద్దిగా తేనె వేసి వేడిగా వడ్డించాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 05 , 2026 | 09:12 AM