Share News

అటుకులు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:15 PM

అటుకులు కేవలం అల్పాహారమే కాదు.. మంచి ఔషధం. అటుకులతో ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా అటుకులతో తయారు చేసే ‘పోహా’ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అటుకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

అటుకులు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు
Poha Health Benefits

ఇంటర్నెట్ డెస్క్: అటుకులు రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. బ్రేక్ ఫాస్ట్ గా, రాత్రుళ్లు డిన్నర్‌లో అటుకులతో తయారు చేసే పోహా ఎంతో రుచికరంగా ఉంటుంది. అటుకులు చాలా తేలికగా ఉంటాయి. వడ్లను ఉడికించి, ఎండబెట్టి ఆపై దంచుతారు. ఇది జీర్ణ సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు.


1.ఐరన్:

రక్తహీనత ఉన్నవారికి అటుకులు ఒక వరమనే చెప్పాలి. గర్భిణులు, పిల్లలకు ఇందులో ఉండే పోషకాలు ఎంతో బలాన్ని ఇస్తాయి. అటుకులపై కొంచెం నిమ్మరసం పిండుకుని తింటే, అందులో విటమిన్- సి వల్ల ఐరన్ మన శరీరానికి బాగా అందుతుంది.

2. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు:

అటుకుల్లో సుమారు 76.9 శాతం ఆరోగ్యకరమై కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే ఉదయాన్నే వీటిని తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

3. బరువు తగ్గడానికి సహకరిస్తాయి:

బరువు తగ్గాలనుకునే వారు అటుకులను నిరభ్యంతరంగా తినవచ్చు. వీటిలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. దీని వల్ల కడుపు నిండుగా అనిపించి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.

4. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:

అటుకుల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూరగాయలు, వేరుశనగలు, పప్పులతో కలిపి తీసుకోవడం మంచిది.


5. గ్లూటేన్ లేని ఆహారం:

గోధమలు పడని వారు, గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు అటుకులు తినవచ్చు. ఇది సహజంగానే గ్లూటెన్ రహితం కాబట్టి ఎలాంటి మంట, అలర్జీ సమస్యలు రావు.

6. మెదడు పనితీరుకు మేలు:

అటుకుల్లో ఉండే విటమిన్-బి మెదడు చురుగ్గా పనిచేయడానికి సహకరిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతుంది.

7. తక్కువ కొలెస్ట్రాల్:

అటుకుల్లో కొవ్వు పదార్ధాలు దాదాపు సున్నా, వీటిని వేయించకుండా, తక్కువ నూనెతో పోపు పెట్టుకుని తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బియ్యంతో తయారయ్యే ఈ అటుకులు అన్నం తిన్నంత తృప్తినిస్తాయి.

8. ఎర్ర అటుకులు బెస్ట్:

పల్చటి అటుకుల కంటే, దొడ్డు అటుకులు లేదా ఎర్ర అటుకులు వాడటం శ్రేయస్కరం. ఎర్ర అటుకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 04 , 2026 | 04:44 PM