Share News

టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్.. బరువు తగ్గడానికి ఏది మంచిది?

ABN , Publish Date - Feb 04 , 2026 | 08:07 AM

బరువు తగ్గాలనుకునే వారికి టోన్డ్ మిల్క్ మంచిదా లేదా నార్మల్ మిల్క్ మంచిదా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే, పాలు ఆరోగ్యానికి మంచివైనా, వాటిలో ఉండే కొవ్వు శాతం బరువు తగ్గడంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
Toned Milk Vs Normal Milk

ఇంటర్నెట్ డెస్క్: పాలు (Milk) అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అలాగే 13 రకాల కీలకమైన పోషకాలను అందించడంలో పాలు సహాయపడుతాయి. కానీ మీ ఆరోగ్య స్థితిని బట్టి దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.


టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్

ఆరోగ్య నిపుణుల ప్రకారం, బరువు తగ్గాలనుకునే వారికి టోన్డ్ మిల్క్ మంచి ఎంపిక. టోన్డ్ పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది (సుమారు 3%). ఫుల్ క్రీమ్ పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండటం వల్ల టోన్డ్ పాలలో కేలరీలు కూడా తక్కువ. అయితే, టోన్డ్ పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు మాత్రం దాదాపు ఫుల్ క్రీమ్ పాలతో సమానంగానే ఉంటాయి. కాబట్టి కండరాలు, ఎముకలు, శరీర జీవక్రియకు అవసరమైన పోషకాలు అందుతాయి.


ఫుల్ క్రీమ్ పాలు ఎక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. అవి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలా చురుకుగా పనిచేసే వాళ్లు లేదా త్వరగా ఆకలి వేసే వాళ్లు పరిమితంగా ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవచ్చు. అయితే, కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి రోజూ టోన్డ్ పాలు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వీళ్లు పాలు తాగకూడదు?

చాలామందికి తెలియకుండానే లాక్టోస్ అసహనం ఉంటుంది. అంటే పాలు సరిగా జీర్ణం కావు. పాలు తాగిన తర్వాత తరచూ అజీర్ణం, ఆమ్లత్వం, IBS సమస్యలు వస్తుంటే, అటువంటి వారు పాలు, పాల ఉత్పత్తులను దూరంగా పెట్టడం మంచిది. పాలు తాగలేని వాళ్లు ఓట్స్ లేదా ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. ఓట్స్ తయారు చేయడం సులభం, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అర కప్పు ఓట్స్‌లో సుమారు 200 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అందుకే ఇవి సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 04 , 2026 | 08:21 AM