బ్రెయిన్ స్ట్రోక్.. కారణాలు ఇవే!
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:48 PM
నేటి బిజీ జీవనశైలి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ సమస్య వృద్ధులతో పాటు యువతలో కూడా పెరుగుతోంది. కొన్ని సాధారణ తప్పులే ఈ ప్రమాదకర సమస్యకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఇవి ఇప్పుడు వృద్ధులకే కాదు.. యువతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మన బిజీ జీవనశైలి. ఉదయం ఆలస్యంగా లేవడం, తొందరపడి పనులకు వెళ్లడం, వ్యాయామం చేయకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, బయట ఆహారం తినడం, రాత్రి ఆలస్యంగా పడుకోవడం.. ఇలాంటి అలవాట్లు స్ట్రోక్ వంటి ప్రమాదకర సమస్యలకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడుకు సరైన రక్త సరఫరా లేకపోయినప్పుడు లేదా మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉంటాయి.
అధిక రక్తపోటు
అధిక రక్తపోటు ఉంటే రక్తనాళాలు బలహీనపడతాయి. దీంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలామందికి రక్తపోటు ఉన్నా లక్షణాలు కనిపించవు. కాబట్టి తరచూ బీపీ చెక్ చేయించుకోవడం చాలా అవసరం.
అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం
ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ నూనె, కారంగా ఉండే ఆహారం వల్ల రక్తనాళాల్లో కొవ్వు చేరుతుంది. దీని వల్ల రక్త ప్రవాహం తగ్గి స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతాయి.
ధూమపానం, మద్యం
సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు బలహీనపడతాయి. రక్తం చిక్కబడుతుంది. మద్యం రక్తపోటును పెంచుతుంది. ఈ రెండు అలవాట్లు కలిసి శరీరాన్ని లోపలినుంచి దెబ్బతీస్తాయి. చిన్న వయసులోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
అధిక ఒత్తిడి
ఎప్పుడూ ఒత్తిడిలో ఉండటం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఇది బీపీ, షుగర్ స్థాయిలను పెంచుతుంది. దీర్ఘకాలంగా ఒత్తిడిలో ఉండే వారికి స్ట్రోక్ ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
ఇతర కారణాలు
వయస్సు పెరగడం
కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉండటం
ఎక్కువ కాలుష్యంలో ఉండడం
వైరల్ ఇన్ఫెక్షన్లు
ఈ కారణాలన్నీ కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే, జీవనశైలిని మార్చుకుంటే బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News