పిల్లలు సిరప్ తీసుకున్న వెంటనే వాంతులు చేసుకుంటే ఏం చేయాలి?
ABN , Publish Date - Feb 07 , 2026 | 08:21 AM
పిల్లలకు సిరప్ ఇచ్చిన వెంటనే వాంతులు చేసుకున్న సమయంలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. మరో డోస్ ఇవ్వాలా? లేక ఇవ్వకూడదా? అనే సందేహం ఉంటుంది.. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. పిల్లలకు జ్వరం, దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మందులు ఇవ్వడం సర్వసాధారణం. చిన్నారులు మాత్రలు మింగడానికి ఇబ్బంది పడడం వల్ల ఎక్కువగా సిరప్ రూపంలో ఇస్తుంటారు. అయితే కొంతమంది పిల్లలు సిరప్ తీసుకున్న వెంటనే వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
నిపుణుల సూచనల ప్రకారం, పిల్లలు సిరప్ తీసుకున్న 20 నిమిషాల లోపే వాంతులు చేసుకుంటే.. ఆ మందు శరీరంలోకి పూర్తిగా చేరకపోవచ్చు. అప్పుడు డాక్టర్ సలహా మేరకు మరోసారి డోస్ ఇవ్వవచ్చు. కానీ ఒక గంట తర్వాత వాంతి చేసుకుంటే మందు కొంతవరకు శరీరంలోకి చేరి ఉండే అవకాశం ఉంటుంది. వాంతిలో మందు స్పష్టంగా కనిపిస్తే మాత్రమే మరో డోస్ గురించి ఆలోచించాలి. సందేహం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పిల్లల నోటిలో ఒకేసారి ఎక్కువ సిరప్ పోయకండి.
సిరప్ ఇవ్వడానికి చిన్న సిరంజి లేదా మెజరింగ్ డ్రాపర్ ఉపయోగించండి.
ఖాళీ కడుపుతో మందు ఇవ్వాల్సి వస్తే ముందుగా డాక్టర్ సలహా తీసుకోండి.
ప్రతిసారి సిరప్ ఇచ్చిన తర్వాత వాంతులు చేసుకుంటుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
పిల్లల ఆరోగ్యం విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ సురక్షితం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News