కాకరకాయ చేదు అని వదిలేస్తే.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్సయినట్లే..
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:16 PM
చాలా మంది కాకరకాయ తినడానికి ఆసక్తి చూపరు.. ఎందుకంటే దీని రుచి చేదుగా ఉంటుంది. అయితే, కాకరకాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా కాకరకాయను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. దీనికి ప్రధాన కారణం అందులో ఉండే విపరీతమైన చేదు. కానీ, చేదుగా ఉండే ఆ కాకరకాయలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కాకరకాయను తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ ప్రకృతి ఇచ్చిన వరమని చెబుతున్నారు. కాకరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
1. షుగర్ వ్యాధికి చెక్:
షుగర్ వ్యాధితో బాధపడేవారికి కాకరకాయ ఒక వరం. కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాకరకాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్న వారిలో చక్కర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయ తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2.గుండె ఆరోగ్యానికి:
కాకరకాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచటానికి సహకరిస్తాయి. ఈ ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె సమస్యలు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
3. చర్మ సౌందర్య:
కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. మొటిమలు, నల్లని మచ్చలు, ముడతలు తగ్గించడమే కాదు.. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. అలర్జీలు, ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
4. రోగనిరోధక శక్తి:
కాకరకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
5. కంటి ఆరోగ్యం:
ఇందులో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రేచీకటి, కంటి శుక్లాలు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. కాకరకాయ ఆకుల్లో ఐరన్ ఎక్కవగా ఉంటుంది.. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
6. కాలేయ ఆరోగ్యం:
కాకరకాయ రసం తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కామెర్లు, ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
7. శ్వాసకోశ సమస్యలు దూరం:
కాకరకాయ శ్వాసకోశ సమస్యలైన దగ్గు, జలుబు, ఆస్తమా వంటి వాటికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల మార్గాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది, శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News