నిద్రలేమికి కారణమయ్యే ఆహారాలు ఇవే
ABN , Publish Date - May 09 , 2026 | 07:34 PM
మంచి ఆరోగ్యానికి సరైన నిద్ర ఎంతో అవసరం. అయితే రాత్రిపూట తీసుకునే కొన్ని ఆహారాలు నిద్ర నాణ్యతను ప్రభావితం చేసి నిద్రలేమికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మంచి ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా అవసరం. కానీ ప్రస్తుతం బిజీ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తినే కొన్ని ఆహారాలు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రిపూట ఏం తింటున్నామన్నది కూడా చాలా ముఖ్యం.
నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు
పుచ్చకాయ, దోసకాయ వంటి ఆహారాలు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని రాత్రిపూట ఎక్కువగా తింటే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. దీంతో నిద్ర మధ్యలో భంగం కలుగుతుంది. అలాగే, అధిక మసాలా లేదా డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తింటే ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇవి శరీరానికి అసౌకర్యం కలిగించి నిద్రను దూరం చేస్తాయి.
చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు
కేకులు, స్వీట్లు వంటి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి. దీని వల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. చాక్లెట్‌లో కెఫీన్, చక్కెర రెండూ ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజపరిచి గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లో కెఫీన్ మరింత ఎక్కువగా ఉంటుంది.
గ్యాస్‌కు కారణమయ్యే కూరగాయలు
బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి కొందరిలో గ్యాస్ సమస్యకు కారణమై నిద్రలో అసౌకర్యం కలిగించవచ్చు. అలాగే, పిజ్జా, బర్గర్, పనీర్, మటన్ వంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో శరీరం రాత్రంతా ఆహారం జీర్ణించడంలోనే బిజీగా ఉండి గాఢ నిద్రకు ఆటంకం కలుగుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News