Share News

వింటర్‌లో విటమిన్ డీ లోపం.. కారణాలివే!

ABN , Publish Date - Nov 29 , 2026 | 08:22 PM

శీతాకాలంలో చాలామందిలో విటమిన్ డీ లోపం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో జీవనశైలిలోని చిన్న చిన్న మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చని వివరిస్తున్నారు.

వింటర్‌లో విటమిన్ డీ లోపం.. కారణాలివే!
Vitamin D Deficiency

ఇంటర్నెట్ డెస్క్: ఎముకల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు విటమిన్ డీ చాలా అవసరం. అయితే శీతాకాలంలో చాలామందిలో విటమిన్ డీ లోపం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో జీవనశైలిలోని చిన్న చిన్న మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చని వివరిస్తున్నారు. వింటర్‌లో విటమిన్ డీ లోపం వెనుక కారణాలు ఏంటో తెలుసా..?


సూర్యరశ్మి లేకపోవడం

విటమిన్ డీకి సూర్యరశ్మి సహజ వనరు. సూర్యుడి నుంచి వెలువడే యూవీబీ కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తి అవుతుంది. అయితే చలికాలంలో పొగమంచు కారణంగా సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్ డీ లోపం తలెత్తవచ్చు.

ఇంట్లోనే ఉండడం..

చాలామంది చలి నుంచి రక్షించుకునేందుకు ఎక్కువ సమయం ఇంట్లో, కార్యాలయాల్లో గడుపుతారు. బయటకు వెళ్లినా స్వెటర్లు, జాకెట్లు ధరిస్తారు. దీని వల్ల చర్మానికి చేరే సూర్యరశ్మి పరిమాణం తగ్గిపోతుంది.

జీవనశైలిలో మార్పులు..

శీతాకాలంలో శారీరక శ్రమ, వ్యాయామం వంటివి తక్కువగా చేస్తారు. ఇదీ విటమిన్ డీ లోపానికి కారణం. చలి కారణంగా వ్యాయామం చేయడానికి కొందరు ఇష్టపడరు.

విటమిన్ డీ కోసం ఏం చేయాలి..?

ఉదయం లేదా మధ్యాహ్న వేళల్లో కాసేపు ఎండలో నిలబడాలి. సాధారణంగా 10 నుంచి 15 నిమిషాలు చాలు. అలాగే ఆహారంపైనా దృష్టి పెట్టాలి. చేపలు (సాల్మన్, సార్డిన్, ట్యూనా), గుడ్డు పచ్చసొన, పాలు, పెరుగు, తృణధాన్యాలు, పుట్టగొడుగులు తీసుకోవాలి. అవసరమైతే రక్తపరీక్ష ద్వారా విటమిన్ డీ స్థాయిని చెక్ చేసుకోవచ్చు.


ఇవీ చదవండి

డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? రోజుకు 5 నిమిషాలు ఈ 7 వ్యాయామాలు చేస్తే చాలు!

మఖానా పోషకాల ఖజానా.. లోటస్ సీడ్స్ తింటే వచ్చే ప్రయోజనాలు ఇవే..

Updated Date - Nov 29 , 2026 | 08:29 PM