ఎండలో బయటకు వెళ్తున్నారా? వీటిని మీ వెంట తీసుకెళ్లండి..!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:46 PM
ఎండలో బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త! వడదెబ్బకు గురవ్వకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట ఈ వస్తువులను తప్పక తీసుకెళ్లండి. మరి ఆ వస్తువులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉదయం 9 దాటిందంటే చాలు.. భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో బయటకెళితే మాడు పగిలిపోయేలా ఎండ దంచుతోంది. అందుకే.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు జడుసుకుంటున్నారు. ఎండ కొడుతోందని అత్యవసర పనులను వదులుకోలేము కదా..? మరి ఎండ వేడిమి నుంచి ఎలా బయటపడాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతున్నారు. పనిమీద బయటకు వెళ్లిన వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన వడదెబ్బకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లేవారు కొన్ని వస్తువులు తమ వెంట తీసుకెళ్లడం సేఫ్ అని చెబుతున్నారు.
వాటర్ బాటిల్: ఎండాకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తమ వెంట మంచినీళ్ల బాటిల్‌ను తీసుకెళ్లాలి. ఎండ వేడిమి కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే.. మీ వెంట మంచి నీళ్ల బాటిల్‌ను తీసుకెళ్లాలి. తరచుగా నీరు తాగుతుండాలి. ఇలా వాటర్ తాగడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగడం వలన కూడా హైడ్రేట్‌గా ఉంటారు.
గొడుగు: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పనుల కోసం బయటకు వెళ్లేవారు, ఎండలో తిరిగే వారు తప్పనిసరిగా తమ వెంట గొడుగు తీసుకెళ్లాలి. గొడుగు వినియోగించడం వలన మీపై ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగలకుండా నివారించవచ్చు.
పిల్లలకు క్యాప్: స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలు ఆటలాడుకునేందుకు బయటకు వెళ్తుంటారు. మరికొందరు పేరెంట్స్ తమ పిల్లలను స్విమ్మింగ్ క్లాసులు, ఇతర ప్రోగ్సామ్స్ కోసం కోచింగ్ సెంటర్లకు పంపిస్తుంటారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పిల్లలకు తప్పనిసరిగా క్యాప్ పెట్టి పంపించాలి. ఆటలకైనా.. కోచింగ్ సెంటర్లకైనా.. ఎండలో బయటకు వెళ్తున్నట్లయితే వారికి క్యాప్ పెట్టి పంపించండి. తద్వారా పిల్లలకు ఎండ తగలకుండా ఉంటుంది.
సన్ గ్లాసులు: ఎండ తీవ్ర మన కళ్లపై అధిక ప్రభావం చూపుతాయి. అందుకే.. ఎండ తీవ్రత నుంచి కళ్లను రక్షించుకునేందుకు సన్ గ్లాసులు ధరించాలి. ఈ కళ్లద్దాలు కళ్లను వేడి నుంచి రక్షిస్తాయి. ఈ గ్లాసులు మార్కెట్‌లో ఈజీగా దొరుకుతాయి.
Also Read:
అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్
ఈ నవజాత శిశువు చేసిన పని చూస్తే.. వైరల్ వీడియో..
నాయకత్వ మార్పుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : డీకే శివకుమార్