వేసవి కాలం.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:44 PM
వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవుల సందడి మొదలవుతుంది. చాలా మంది పిల్లలు వేసవి కాలంలో ఎక్కువగా బయట ఆడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవుల సందడి మొదలవుతుంది. చాలా మంది పిల్లలు వేసవి కాలంలో ఎక్కువగా బయట ఆడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి సమయంలో వారి ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలంలో పిల్లలు వారి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం..
1. ఆహారం:
వేసవిలో జీర్ణక్రియ మందగిస్తుంది, కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు అంటే కర్బూజ, నారింజ, పుచ్చకాయ వంటి పండ్లను స్నాక్స్‌గా ఇవ్వండి. నూనెలో వేయించిన పదార్ధాలు, అధిక మసాలాలు ఉన్న ఆహారం వల్ల కడుపలో మంట, అజీర్ణి కలగొచ్చు. అందుకే తేలికగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
2. మంచినీరు:
వేసవి కాలంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. దీని వల్ల పిల్లలు నీరసించిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఆడుకునే ప్రదేశంలో ఎప్పుడూ వాటర్ బాటిల్ అందుబాటులో ఉంచాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగాలని పిల్లలకు చెప్పాలి. నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ వంటివి తరుచూ ఇస్తే పిల్లలకు మంచి ఎనర్జీ అందుతుంది.
3. బయటకు వెళ్లే సమయాలు:
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయం (ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటలు) ఈ సమయంలో పిల్లలను బయట ఆడనివ్వకూడదు. సాధ్యమైనంత వరకు ఇండోర్ గేమ్స్, పేయింటింగ్స్ లేదా కథల పుస్తకాలు చదవడం వంటి అలవాట్లను ప్రోత్సహించండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. టోపీ, సన్ గ్లాసెస్, సన్ స్క్రిన్ లోషన్లు వాడాలి.
4. చర్మ సంరక్షణ:
చెమట వల్ల చర్మంపై దుద్దర్లు, చెమటకాయలు వస్తుంటాయి. పిల్లలకు సాధ్యమైనంత ఉదయం, పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయిస్తే ఇన్ఫెక్షన్లు రావు. పిల్లలు బయట ఆడుకొని వచ్చిన తర్వాత చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలి.
5. సాఫ్ట్ డ్రింక్స్:
పిల్లలు వేసవి కాలంలో చాలా వరకు కూల్ డ్రింక్స్, టెట్రా ప్యాక్డ్ జ్యూస్‌లు తాగడానికి ఇష్టపడతారు. ఈ డ్రింక్స్‌ను వారికి దూరంగా ఉంచడం మేలు. ఎందుకంటే వీటిలో చెక్కర శాతం ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News