Share News

వేసవిలో చెరుకురసం.. ఆరోగ్య ప్రయోజనాలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 09:36 PM

వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడి దాంతో పాటు దాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు మంచివని అంటారు.

వేసవిలో చెరుకురసం.. ఆరోగ్య ప్రయోజనాలు
Sugarcane Juice Benefits

ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడితో పాటు దాహం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు మంచివని అంటారు. ఈ సీజన్‌లో వరకు చల్లని పానియాలు.. అంటే కూల్ డ్రింక్స్, సోడాలు, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంటారు. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే చెరుకు రసం కూడా వేసవి కాలంలో ఎక్కువగా అమ్ముడుపోయే పానీయం. దీనితో శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.


1. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం:

ఎండల వల్ల మన శరీరంలోని నీరు, లవణాలు చెమట రూపంలో బయటకు పోతాయి. చెరకు రసంలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరానికి తిరిగి శక్తినిచ్చి, డీహైడ్రేషన్ కాకుండా కాపాడతాయి.

2. తక్షిణ శక్తి:

చెరకు రసంలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో త్వరగా కలిసిపోయి, ఎండ వల్ల వచ్చే అలసటను తక్షణమే పోగొడతాయి.

3. కాలేయ ఆరోగ్యానికి మంచిది:

ఆయుర్వేదం ప్రకారం, చెరకు రసం కాలేయాన్ని బలపరుస్తోంది. ముఖ్యంగా కామెర్లు వంటి సమస్యలు ఉన్నప్పుడు కాలేయం పనితీరు మెరుగుపరచడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

4. చర్మ సౌందర్యం:

ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ మొటిమలు తగ్గించి, చర్మాన్ని తాజాగా మెరిచేలా చేస్తుంది.

5. చెరుకు రసంలో కొంచెం అల్లం రసం, నిమ్మరసం, పుదీనా కలిపి తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • రోడ్డు పక్కన బండ్ల మీద తాగేటప్పుడు ఈగలు లేకుండా, గ్లాసులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

  • రసం తీయగానే తాగేయడం మంచిది. నిల్వ ఉంచితే అది త్వరగా ఆక్సీకరణం చెంది రంగు మారుతుంది.

  • షుగర్ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read

వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?

For More Latest News

Updated Date - Mar 15 , 2026 | 09:52 PM