చిటికెడు జాజికాయతో అద్భుతమైన ప్రయోజనాలు.!
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:56 PM
వైరల్ ఇన్ఫెక్షన్లకు జాజికాయ సహజ వైద్యంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ముఖ్యమైన ఔషధ గుణాలు కలిగిన జాజికాయతో కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే జలుబు, దగ్గు, నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: జాజికాయను వంటల్లో రుచి కోసం ఉపయోగించినప్పటికీ, ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. మిరిస్టికా ఫ్రాగ్రన్స్ చెట్టు పండులో నుంచి లభించే జాజికాయలో శరీరానికి ఉపయోగపడే అనేక గుణాలున్నాయి. వివిధ సమస్యలకు పరిష్కారం చూపే జాజికాయ ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జలుబు, దగ్గుకు ఉపశమనం..
జాజికాయను పాలలో రుబ్బి తక్కువ మోతాదులో తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. పిల్లలకు చాలా స్వల్పంగా మాత్రమే ఇవ్వాలి. ఇది ముక్కు దిబ్బడ తగ్గించడంలో సాయపడుతుంది.
చర్మానికి మేలు చేస్తుంది..
జాజికాయ పొడిని పాలు లేదా రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి పూస్తే.. మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. వారానికి రెండు లేదా మూడుసార్లు ముఖానికి పూసి 10-12 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
నిద్ర బాగా పడుతుంది..
రాత్రి గోరువెచ్చని పాలలో రెండు చిటికెల జాజికాయ పొడి కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
కీళ్ల నొప్పులకు ఉపశమనం..
జాజికాయ నూనె లేదా జాజికాయ పొడిని నువ్వుల నూనెతో కలిపి.. నొప్పిఉన్న చోట రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికీ ఇది ఉపయోగపడుతుంది.
దుర్వాసన తగ్గించడానికి..
జాజికాయలో యాంటీబాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. జాజికాయ పొడితో తయారు చేసిన మౌత్‌వాష్ ఉపయోగిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. చిన్నముక్కను నమిలినా ప్రయోజనం ఉంటుంది. జాజికాయను మితంగా మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News